సుశాంత్ రాజ్ పుత్ ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తోన్న సినిమా ‘రాబ్తా’. ఈ సినిమా మగధీరకు కాపీ అని సినిమా ట్రైలర్ విడుదలయినప్పటి నుండి రచ్చ జరుగుతోంది. దీంతో తమ సినిమాను కాపీ కొట్టినందుకు పరిహారం చెల్లించాల్సిందే అని లేదంటే సినిమా విడుదల కానివ్వమని అల్లు అరవింద్ రాబ్తా దర్శకనిర్మాతలపై కేసు వేశారు. కోర్టులో దీనిపై విచారణ జరపనున్నారు. అయితే ఇది కాపీ సినిమా కాదని.. ఒరిజినల్ కథ అని సినిమా హీరో సుశాంత్ అన్నారు. ట్రైలర్ చూసి సినిమా కథ ఏంటో..? ఎలా డిసైడ్ చేస్తారని ప్రశించారు. కొన్ని పోలికలు కనిపించినంత మాత్రం చేత కాపీ చేసినట్లేనా.. అని అడుగుతున్నారు.
ఇంతవరకు ఇండియన్ తెరపై రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో రాబ్తా సినిమాను తెరకెక్కించామని, కోర్టులో కేసుని కొట్టి పారేస్తారని అనుకున్నట్లుగానే సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని స్పష్టం చేశారు. వాస్తవానికి మగధీర సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ అది మెటీరియలైజ్ కాలేదు. దీంతో ఆ కాన్సెప్ట్ తీసుకొని కొత్త బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసినట్లున్నాడు రాబ్తా దర్శకుడు. మరి కోర్టు దీన్ని స్ఫూర్తిగా పరిగణిస్తుందో.. లేక కాపీ అని తేల్చేస్తుందో.. చూడాలి!