ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా రాబోతున్న ‘టిక్ టిక్ టిక్’ విడుదలకు సిద్దమవుతోంది. విలక్షణమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ముందుండే చదలవాడ బ్రదర్స్ ‘టిక్ టిక్ టిక్’ ను టాలీవుడ్ లోకి అనువదిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్మణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 22న విడుదల చేస్తున్నారు.అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్ వర్కతో పాటు. థ్రిల్ కలిగించే సౌండ్ ఎఫెక్ట్‌తో టిక్ టిక్ టిక్ సిద్దమవుతుంది. ఆడియెన్స్‌కి ఇదొక విజువల్ ఫీస్ట్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది.
ఈ సందర్భంగా చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ..”టిక్ టిక్ టిక్ సెన్సార్ పూర్తియింది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన తొలి ఇండియన్ చిత్రం ఇది. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా ఉంటుంది. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయింది. ‘బిచ్చగాడు’, డి16 సినిమాలను తెలుగులో విడుదల చేసినప్పుడు ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వాటిని మించెలా తెరకెక్కిన విలక్షణమైన సబ్జెక్ట్ ఇది” అన్నారు.