Homeతెలుగు Newsజములపల్లిలో మేఘా శ్రీమంతుడి దాతృత్వం

జములపల్లిలో మేఘా శ్రీమంతుడి దాతృత్వం

ఎంత ఎత్తుకు ఎదిగినా కన్న తల్లిని, సొంత ఊరును మరువరాదంటారు. ఏ స్థాయిలో ఉన్నా.. ఎంత బీజీగా ఉన్నా.. ఊరి బాగుకోసం తన వంతు కృషి చేస్తున్నారు మేఘా ఇంజినీరింగ్‌ చైర్మన్‌ పీపీ రెడ్డి. తను పుట్టిన మట్టి మీద ప్రేమతో, జములపల్లి ఊరి ప్రజల మీద మమకారంతో దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం జములపల్లిలో ఇప్పటికే సోలార్‌ ప్లాంట్‌, కల్యాణ మండపం, సీసీ రోడ్లు, మరుగు దొడ్లు, పార్కులు ఏర్పాటు చేసిన ఆయన తాజాగా ఇంటింటికీ తాగునీరంధించే పథకాన్ని ఆదివారం జములపల్లి గ్రామంలో ప్రారంభించారు.

MEIL A

మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంతమేరకు ఎల్లప్పుడూ ముందుటుందని సంస్థ చైర్మన్‌ శ్రీ. పిపి రెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం జములపల్లి గ్రామంలో ఇంటింటికీ కుళాయి పథకాన్ని శ్రీ. పిపి రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన ఈ ఊరికి సేవ చేయడం తన అదృష్టమని తెలిపారు. ఎంఈఐఎల్‌ తమ సామాజిక బాధ్యతలో (సీఎస్‌ఆర్‌) భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఏరియా ఆసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తనకు, తన తల్లికి జన్మనిచ్చిన జములపల్లి అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. ప్రతి ఏడాది సంక్రాంతి నెలలో ఈ గ్రామం సందర్శించడం ఆనవాయితీగా మారిందని తెలిపారు. ఈ గ్రామంతో పాటు, ప్రజల అభిమానం వల్లే తాను ఇంతటివాడినయ్యానని అన్నారు. సమాజం తనను ఉన్నత స్థాయికి చేర్చినందునే వారికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తమను సంప్రదిస్తే తమ శక్తి మేరకు పరిష్కరించడానికి కృషి చేస్తామని శ్రీ పి. పి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిపి రెడ్డి సతీమణి రమారెడ్డితో పాటు కుమార్తెలు మేఘా రెడ్డి, మంజలి రెడ్డి, మాజీ సర్పంచు రాయుడు సురేష్, గ్రామపెద్దలు జంగమయ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

50 లక్షల రూపాయలతో ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకాన్ని పూర్తిచేశారు. జములపల్లి గ్రామంలో రెండు వేల మంది గ్రామ పంచాయితీ ఏర్పాటు చేసిన వీధి కుళాయి నుంచి తమ ఇంటి అవసరాలకు నీటిని తెచ్చుకుంటున్నారు. ఇక నుంచి వారికి ఆ సమస్య తీరనుంది. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఎనిమిది వందకు పైగా ఇళ్లకు సుమారు వెయ్యి నీటి కుళాయిలను ఫెరల్‌ పద్ధతిని వినియోగించి అమర్చామని మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ఇంజనీర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ఈ విధానం వల్ల ప్రతి ఇంటికి హెచ్చు తగ్గు లేకుండా ఒకే పద్ధతిలో నీరు సరఫరా అవుతుంది. ఎవరైనా ఎక్కువ నీటిని పొందవచ్చనే ఉద్ధేశ్యంతో ఎలక్ట్రిక్ మోటార్లు బిగించినా అవి పనిచేయకపోవడం ఫెరల్‌ ప్రత్యేకత.
గ్రామంలో ప్రతి ఇంటికి నీటి సరఫరాకు అనుగుణంగా ఎనిమిది కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేశారు. నీటి సరఫరా చేసేందుకు ఇప్పటికే గ్రామ పంచాయితీ నిర్మించిన రెండు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఆధునీకరించి వినియోగించనున్నారు. గ్రామస్థుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే రెండు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను మేఘా ఇంజనీరింగ్‌ ఛైర్మన్‌ పీపీ రెడ్డి ఏర్పాటు చేశారు.

MEIL 2

ఎంఈఐఎల్‌ సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో ఇప్పటికే 12 కిలోవాట్ల సామర్ధ్యంతో కూడిని సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 240 ఇళ్లకు రెండు బల్బులు, ఒక ప్యాన్‌ వినియోగించే విద్యుత్‌, వీధి దీపాలకు కరెంటు సరఫరా అవుతోంది. అన్ని వసతులతో కూడిన కల్యాణ మండపం, సిమెంట్లు రోడ్లు, మరుగుదొడ్లు, పార్కును ఏర్పాటు చేశారు. జముపల్లిలోని పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన బల్లలను అందించారు. గ్రామంలోని రోడ్ల పక్కన గ్రామస్తులు సేద తీరేందుకు అనువుగా సిమెంట్‌ బల్లలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జముపల్లికి పొరుగున ఉన్న నర్సింగాపురం గ్రామంలో మంచినీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయటంతో పాటు స్థానిక పాఠశాలలోని విద్యార్ధులు కూర్చునేందుకు బల్లలను ఏర్పాటు చేసారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu