జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బలపడే కొద్దీ తమ విజయావకాశాలు పెరుగుతాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ‘పవన్, జనసేన అభిమానులంతా 2014 ఎన్నికల్లో టీడీపీకి వేశారు. అవి ఇపుడు పూర్తిగా జనసేనకు వెళుతాయి.. అంటే టీడీపీ బలనహీనపడుతుంది. మా విజయ అవకాశాలు పెరుగుతాయ’ని జగన్ అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు జగన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కాపు సామాజిక వర్గం గతంలోనూ, ఇపుడూ తమ పార్టీ వెంటే ఉందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ బలపడే కొద్దీ తమ విజయం ఖాయమని జగన్ అన్నారు.
ఈసారి గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తమకేనని ఆయన అన్నారు. ‘కాపులు ప్రధానంగా రైతు బిడ్డలు. బాబు హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని రైతుకు గిట్టుబాటు ధరలు అందడం లేదు అని రిజర్వేషన్ల విషయంలోనూ కాపులను చంద్రబాబు మోసం చేశాడు’ అని జగన్ అన్నారు. అత్యధిక సీట్లు గెల్చుకోవడం ద్వారా ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. మొత్తం 25 సీట్లు సాధించకపోయినా…. మెజారిటీ సీట్లు వైసీపీ పార్టీ సాధిస్తూంది అని జగన్ అన్నారు.