Homeతెలుగు Newsజనసేన పార్టీలో చేరనున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు

జనసేన పార్టీలో చేరనున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు

2 20

తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరనున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 32 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో అనేక పదవులు చేపట్టానని… రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీలోనే ఉంటూ సేవలందించానని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతూ వెనుకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో తనకెటువంటి విబేధాలు లేవని… ఒక్క కార్యకర్తను కూడా వెంట తీసుకెళ్లడం లేదన్నారు. జనసేన పార్టీలో టికెట్‌ ఆశించడం లేదని… కేవలం పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చినందువల్లే ఆయన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పవన్‌ జిల్లా పర్యటన సమయంలో అధికారికంగా చేరతానని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu