తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరుతున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 32 ఏళ్లుగా కాంగ్రెస్‌లో అనేక పదవులు చేపట్టానని… రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీలోనే ఉంటూ సేవలందించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వెనకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్‌కల్యాణ్ విధివిధానాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో తనకు ఎటువంటి విబేధాలు లేవని… ఒక్క కార్యకర్తను కూడా తన వెంట తీసుకెళ్లడం లేదన్నారు. జనసేన పార్టీలోకి టికెట్ ఆశించి వెళ్లడం లేదని… కేవలం పవన్‌కల్యాణ్ విధివిధానాలు నచ్చినందుకే ఆయన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పవన్ జిల్లా పర్యటన సమయంలో అధికారికంగా చేరతానని చెప్పారు.