జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోసం ప్రచార రథం రెడీ చేస్తున్నారట. సకల హంగులతో ఉండే ఈ రథంలోనే పవన్ భవిష్యత్ పర్యటనలన్నీ చేయబోతున్నారట. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో తన మిత్రుడు తోట చంద్రశేఖర్ ఈ వాహనాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ వాహనం ప్రచారం కార్యక్రమంలో పాల్గొనబోతుందట. ఈ రథంలోనే ప్రముఖులతో సమావేశాలు జరుపుకునేలా, కావాల్సినప్పుడు విశ్రాంతి తీసుకునేలా వీటిలో సకల సౌకర్యాలు సమకూర్చబోతున్నారట. ఇంటర్నెట్, టీవీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయట.
ప్రస్తుత రాజకీయాల్లో ఇటువంటి ఖరీదైన వాహనాలు చంద్రబాబు, జగన్ వద్ద ఉన్నాయి. ఇప్పుడు జనసేన అధినేతకూ రాబోతుంది. వాహనంపై జనసేన సిద్ధాంతాలు, ఆశయాలతో కూడిన పోస్టర్‌లు ఉంటాయట. ప్రస్తుతం జగన్ చేస్తున్న ప్రచారం మాదిరి ప్రచార రథం నుంచే పవన్ ప్రసంగించే అవకాశం ఉంటుంది. మరోవైపు వచ్చే ఎన్నికల కోసం నారా లోకేష్ కూడా ఇలాంటి వాహనం ఒకటి సిద్ధం చేసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.