వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అనే సంగతి అందరికీ తెలుసు. మరెందుకు అతగాడికి ఓట్లు వేస్తున్నారు అంటే ?, అసలు మన దేశంలో అవినీతి పరులు కానీ రాజకీయ నాయకులు ఎవరు చెప్పండి ? అని ఎదురు ప్రశ్నలు సంధిస్తారు. కానీ, ఈ తరానికి తెలియని విషయం ఏమిటంటే.. పుచ్చపల్లి సుందరయ్య, సీనియర్ ఎన్టీఆర్, మన్మోహన్ సింగ్ లాంటి కొందరు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు కదా. ఏ.. అలాంటి వారిని ఎన్నుకోవచ్చు కదా. పోయి పోయి ఒక అవినీతి పరుడిని మళ్లీ సీఎం ను చేస్తారా?. అయినా చేస్తారా ఏమిటి ?, ఆల్ రెడీ చేసేశాం కదా. ఇది ప్రస్తుత ఆంధ్రుల పరిస్థితి.
ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికైనా బాగు పడాలి అంటే ఏమి చేయాలి ? అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఒకసారి గతానికి వెళ్తే.. ఆంధ్ర విడిపోయిన తర్వాత చంద్ర బాబు – జగన్ రెడ్డి వ్యక్తిగత కక్షలతో రాష్ట్రానికి రావాల్సిన అదనపు ప్రయోజనాలు కోసం కలిసి పోరాటం చేయలేదు. ఇక పోలవరం ప్రాజెక్టును అయితే జగన్ రెడ్డి తన కక్షలతో నేటికీ ప్రొజెక్ట్ ను ముందుకు సాగానీయటంలేదు. నిజానికి చంద్రబాబు పాలనలోనే పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పు జరిగింది. అప్పుడే పూర్తి చేసి ఉండాల్సింది.
కానీ, టీడీపీ & బీజేపీ అంతరకుమ్మలాటతో మంచి లాభం పొందిన వాడు జగన్ రెడ్డే. చంద్రబాబు ఏపీకి స్పెషల్ స్టేటస్ కేంద్రం నుంచి తీసుకు రావడంలో విఫలం అయ్యారు, కాబట్టి ఇప్పుడు మేము తీసుకొస్తాం అని జగన్ రెడ్డి ప్రజలను నమ్మించాడు. మరి అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు ?. అధికారంలో ఉండి కూడా జగన్ రెడ్డిని సమర్ధవంతంగా అణిచివేయలేకపోయాడు. కేంద్రంతో దెబ్బలాడి సొంత రాష్ట్రంలో కూడా బాబు అధికారం కోల్పోయాడు. ఎట్టకేలకు జగన్ రెడ్డి సీఎం అయ్యాడు.
కానీ, గెలిచాక, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ?, స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరం లేదు. అధికారం చేపట్టి నాలుగో ఏడాదికి వచ్చేసింది. కానీ జగన్ రెడ్డి సాధించింది సున్న. మరి ఇలాంటి జగన్ రెడ్డిని మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలి ?, రాష్ట్ర ప్రజల కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం అంటున్నారు. దాని వల్ల ప్రజల జీవితాలు మారుతున్నాయా ? లేదుగా. పైగా ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా తగ్గుతూ వస్తున్నాయి. అసలు జగన్ రెడ్డి వల్ల ఎంతమేరకు ప్రజలకు చేయూత లభిస్తోంది ?, ఏమీ లేదు. అందుకే, ఈ సారి ప్రజలు ఎవర్ని గెలిపించుకోవాలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి.