వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్ 240వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సుబ్బరాయుడు పాలెం, చంద్రయ్య పాలెం, వజ్రగడ క్రాస్, తమ్మయ్య పాలెం, జోగివాని క్రాస్ మీదుగా ధర్మసాగరం క్రాస్ వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.
వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.