HomeTelugu Reviewsచి.ల.సౌ మూవీ రివ్యూ

చి.ల.సౌ మూవీ రివ్యూ

అక్కినేని వారసుడు సుశాంత్‌ చాలా కాలాంగా హీరోగా ఓ మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఇప్పడు త‌న‌కి త‌గ్గ ఓ సున్నిత‌మైన క‌థ‌ని ఎంచుకొని ‘చి.ల‌.సౌ’ చేశాడు. ఈ చిత్రంతో న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ దర్శకుడిగా మారాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్‌ నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా నచ్చటంతో అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా సుశాంత్‌కు హిట్ ను అందిస్తుందా? రాహుల్‌ రవీంద్రన్‌ కు దర్శకుడిగా నిలబెడుతుందా?

3a

కథ: అర్జున్‌ (సుశాంత్‌) ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చొంటాడు. అతని తల్లిదండ్రులు (అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌) అర్జున్‌ని ఎలాగైన పెళ్లి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు. అమ్మానాన్నల పోరు సరిపోలేదన్నట్లు తన బెస్ట్‌ ఫ్రెండ్‌ (వెన్నెల కిశోర్‌) సుజిత్‌ కూడా అర్జున్‌ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. వాళ్ల తృప్తి కోసం ఓ అమ్మాయిని పెళ్లి చూపులుకు ఒప్పుకుంటాడు అర్జున్‌. రొటీన్‌ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన తల్లిదండ్రలు అర్జున్‌ ఒక్కడినే ఇంట్లో ఉంచి అమ్మాయి వస్తుంది మాట్లాడమని చెప్తారు. (రుహాని శర్మ)హీరోయిన్‌ అంజలి ఓ మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో కుంటుంబానికి తానే పెద్ద దిక్కుగా ఉన్న ఎన్నో బాధ్యతలు ఉన్న అమ్మాయి. అర్జున్‌ ఈ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకున్నాడా..? లేక తన నిర్ణయం ప్రకారం ఐదు సంత్సరాలు టైం తీసుకున్నాడా?.. అసలు వీరి పెళ్లి చూపులు ఎలా జరిగాయి అనేదే కథలో అంశం

3b

నటీనటులు: ఈ చిత్రంలో చాలా మంది నటీ, నటులు ఉన్నా.. హీరో హీరోయిన్లు తప్ప మిగత అన్ని పాత్రలు అతిథి పాత్రలే. సినిమా అంతా అర్జున్‌, అంజలిల చూట్టునే తిరుగుతుంది. అర్జున్‌ పాత్రలో సుశాంత్‌ సహజంగా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రేమకథ కావటంతో డ్యాన్స్‌లు, ఫైట్లు చేసే ఛాన్స్‌ రాలేదు. నటన పరంగా మాత్రం ఫుల్‌ మార్క్‌ సాధించాడు సుశాంత్‌, రుహాని శర్మ హీరోయిన్‌గా ఇది తొలి చిత్రం అయినా తన నటనతో ఆకట్టుకుంది. అర్జున్‌ మీద ఇష్టమున్నా కుటుంబ బాధ్యతల కారణంగా అవుననలేక, కాదనలేక మదన పడే పాత్రలో మంచి నటన కనబరిచింది. అందం, అభినయం రెండింటితోనూ మెప్పించింది. వెన్నెల కిశోర్‌ తన కామోడీ టైమింగ్‌, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వంచాడు. ఇక హీరోయిన్‌ తల్లి రోహిణి, హీరో తల్లిదండ్రులు అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విద్యుల్లేఖ రామన్‌, జయప్రకాష్ కూడా పర్వలేదనిపించారు.

విశ్లేషణ : రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. టేకింగ్‌లోనూ కొత్త దనం చూపించాడు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిశోర్‌, సుశాంత్‌ల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ బోరింగ్‌గా అనిపిస్తాయి. పెళ్లిచూపులు సీన్‌ మొదలైన తరువాత కథనం ఇంట్రస్టింగ్‌ మారుతుంది. సినిమాకు సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం. షూటింగ్ పెద్దగా లోకేషన్లు లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

హైలైట్స్
కథ, కథనం
సినిమాటోగ్రఫి
హీరో, హీరోయిన్‌ నటన
కామెడీ

డ్రాబ్యాక్స్
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్‌ సీన్స్‌

చివరిగా : కుటుంబ సమేతంగా చూడొచ్చు
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

సినిమా : చి.ల.సౌ.
నటీనటులు : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్‌, రోహిణి, అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్‌
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, జస్వంత్‌ నాడిపల్లి, భరత్‌ కుమార్‌
సంగీతం : ప్రశాంత్‌ విహారి

Recent Articles English

Gallery

Recent Articles Telugu

అక్కినేని వారసుడు సుశాంత్‌ చాలా కాలాంగా హీరోగా ఓ మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఇప్పడు త‌న‌కి త‌గ్గ ఓ సున్నిత‌మైన క‌థ‌ని ఎంచుకొని 'చి.ల‌.సౌ' చేశాడు. ఈ చిత్రంతో న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ దర్శకుడిగా మారాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్‌ నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రేమకథగా తెరకెక్కిన ఈ...చి.ల.సౌ మూవీ రివ్యూ