టాలీవుడ్ నూతన దంపతులు నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర్నుండి ఎలాంటి కాంట్రవర్వీలు లేకుండా చాకాగా నడుచుకున్నారు. వీరు వెండి తెర మీదే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. అందుకే లవ్ స్టోరీ పై అందరికీ ఆసక్తి ఎక్కువ. వారిద్దరూ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఎవరో ఒకరు వారి ప్రేమ టాపిక్ తీసుకురాకుండా ఉండరు. తాజాగా రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో సుశాంత్ నటించిన ‘చి.ల.సౌ’ చిత్ర ప్రెస్ మీట్ కు హాజరైన శామ్, చైతులు తమ ప్రేమ కథను అందరికీ వివరించారు.
‘నాకు సమంత ‘ఏ మాయ చేశావె’ నుంచి తెలుసు. ఏడేళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. చివరకు పోన్లే పాపం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడు కదా అని రెండేళ్ల క్రితం ఓకే చెప్పింది. అప్పటి నుంచి ప్రేమించుకున్నాం. కానీ పదేళ్లకు పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది. వేరే ఆప్షన్ లేక(నవ్వుతూ) అన్నారు. ఇందుకు సమంత స్పందిస్తూ.. ‘నీ గురించి బయట చాలా బ్యాడ్‌గా విన్నా బాబూ..’ అనడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. ఇలా చై, శామ్ ఇద్దరూ స్టేజిపై తన లవ్ స్టోరీని చెబుతూ సందడి చేయడంతో ఈవెంట్ ఆద్యంతం సరదాగా సాగిపోయింది.