దేశవ్యాప్తంగా ఈ రోజు (ఆదివారం) రాఖీ పండుగను ఆనందంగా జరుపుకొటున్నారు. ఒకరికొకరు రక్ష అనుకుంటూ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఈ పండుగను జరుపుకుంటారు. అగ్ర కథానాయకుడు చిరంజీవికి ఆయన సోదరీమణులు మాధవి, విజయ రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరు వారికి కానుకలు ఇచ్చారు. వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చిరు కోడలు ఉపాసన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘ప్రియమైన సోదరీమణులతో మామయ్య రక్షాబంధన్ వేడుక’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది.
Mamayas Rakhi celebration with his lovely sisters. ❤️❤️❤️ #HappyRakshaBandhan #MegaStarChiranjeevi #rakhi pic.twitter.com/Jgo0Gq3Liy
— Upasana Kamineni (@upasanakonidela) 26 August 2018