కమల్ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘విశ్వరూపం 2’. రాజ్‌కమల్‌కు ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూన్నారు. ఆండ్రియా, పూజా కుమార్, శేఖర్ కపూర్, శేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 10న సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. పిరిమిడ్ సైమిర ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ సంస్థ కమల్‌కు వ్యతిరేకంగా దావా వేసింది. తమకు ఇవ్వాల్సిన రూ.5.44 కోట్లు చెల్లించాలని, అప్పటి వరకు ‘విశ్వరూపం 2’ విడుదల ఆపాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో జస్టిస్ సీవీ కార్తికేయన్.. కమల్‌కు నోటీసులు పంపారు. కమల్, రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సోమవారానికి వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మర్మయోగి’ సినిమా నిర్మాణ పనుల కోసం తమ సంస్థ 2016లో రూ.5.44 కోట్లు కమల్‌కు ఇచ్చిందని సదరు సంస్థ ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు 2008 ఏప్రిల్ 2న రాజ్‌కమల్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటూ సంతకాలు కూడా చేసినట్లు చెప్పింది. 2016లో రూ.5.44 కోట్లు ఇచ్చామని, ఇప్పుడు వడ్డీతో కలిపి మొత్తం రూ.7.75 కోట్లు అయ్యిందని పేర్కొంది. ఇది ఓ కొలిక్కి రాకుండా ‘విశ్వరూపం 2’ విడుదల కాకూడదని దావా వేసినట్లు తెలిపింది. ఐతే.. కమల్‌హాసన్ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడంతో విశ్వరూపం-2 విడుదలకు కోర్టు ఓకే చెప్పింది.