HomeTelugu Big Storiesచికాగో సెక్స్‌ రాకెట్‌ పై కొనసాగుతున్న గందరగోళం

చికాగో సెక్స్‌ రాకెట్‌ పై కొనసాగుతున్న గందరగోళం

చికాగో సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలు హడలిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీ లో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా మరవకముందే.. చికాగో సెక్స్ రాకెట్ గందరగోళం చేస్తోంది. అమెరికాలో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు నడిపిస్తున్న వ్యభిచార ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రపరిశ్రమ మరోసారి కలవరపాటుకి గురైంది.

4 a

ఈ మధ్య ఓ యంగ్‌ హీరోయిన్‌ ప్రయాణాలపై అనుమానం వ్యక్తంచేసిన అమెరికా పోలీసులు ఆమెను ఆపి చాలాసేపు విచారించారు. ఆమెను పలు రకాలుగా ప్రశ్నించి సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె ప్రయాణాలన్నీ షూటింగ్‌ల కోసమే అని తేలడంతో వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఇంతకుముందు అమెరికాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజి షోలు, చిత్రీకరణలకు హుషారుగా వెళ్లే టాలీవుడు తారలు ఇప్పుడు విదేశాల మాటెత్తితేనే బయపడుతున్నారు.

ఇక పై కష్టమే
సాదారణంగా తెలుగులో అమెరికా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. వాటి కోసం చిత్రయూనిట్‌ లు అక్కడికి తరచుగా వెళ్తుంటాయి. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా అమెరికా తదితర దేశాలకు వెళ్లి వచ్చే తారలకు ఇకపై ఆ పరిస్థితి ఉండదేమో అనే పరిస్థితి ఏర్పడింది.పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే త్వరలో ఒక ప్రముఖ తెలుగు సంఘం నిర్వహించబోయే సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చేందుకు పలువురు తెలుగు సినీతారలు వీసాలకు దరఖాస్తు చేసుకోగా.. అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. ఈ ఉదంతం తెలుగు సంఘాలను, సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఇకపై అమెరికాలో నిర్వహించవలసిన కార్యక్రమాలు, సినిమా షూటింగుల పరిస్థితి ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

చికాగో సెక్స్ రాకెట్ కేసులో తెలుగు సినీ నిర్మాత మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 42 పేజీల ఫిర్యాదును నమోదు చేశారు. చికాగో జిల్లా కోర్టులో ఈ కేసును విచారిస్తున్నారు. రహస్యంగా సెక్స్ రాకెట్ నడిపిన కిషన్.. టాలీవుడ్ నుంచి ఆరుగురు హీరోయిన్లను వ్యభిచారంలోకి దించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చికాగో పోలీసులు ఆధారాలన్నీ సంపాదించినట్లు సమాచారం.

4b

బెదిరింపుతో బలవంతంగా…
చికాగోని బెల్మోంట్ క్రెయిన్ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో తారలు తలదాచుకునే విధంగా కిషనే ఏర్పాట్లు చేశాడు. డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ లాంటి నగరాల్లో ఉన్న హోటల్స్‌లో క్లయింట్లను కలిసినట్లు సమాచారం ఉంది. ఈ రాకెట్‌లోకి దిగిన ప్రతి తారకు చెందిన అకౌంట్ వివరాలన్నీ కిషన్ దగ్గరే లభించాయి. ఎక్కడెక్కడ కస్టమర్‌ను కలుసుకున్నారు, ఎవరి వద్ద ఎంత వసూలు చేశారనే వివరాలు కిషన్ దగ్గరే ఉన్నాయి. ప్రతి హీరోయిన్‌కి ప్రత్యేకంగా అతడు మెయిన్‌టేన్ చేసిన లెడ్జర్‌.. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. అయితే ఈ సెక్స్ రాకెట్ గురించి బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు హీరోయిన్లను కిషన్ ఇప్పటికే బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇబ్బందుల్లో తెలుగు సంఘాలు
చికాగో సెక్స్ రాకెట్‌ కారణంగా ఇప్పుడు అమెరికాలోని తెలుగు సంఘాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్ది రోజులుగా ఎఫ్‌.బి.ఐ. ఏజెంట్లు ఆ సంఘాల ప్రతినిధులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏటా నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యకలాపాలకు తెలుగు సినీపరిశ్రమ నుంచి హీరోయిన్ల్ ను ఆహ్వానించడం మామూలే. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా పోలీసులు వీటన్నింటినీ భూతద్దంతో చూస్తుండటంతో తెలుగు సంఘాల అధికారులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అమెరికా వీసా ఇవ్వాలంటే బలమైన కారణం ఉండాల్సిందే. అక్కడ తెలుగు సంఘాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు తారలను ఆహ్వానిస్తున్నట్లు కిషన్‌ దంపతులు పత్రాలు పుట్టించారు. ఇప్పుడు ఇవే తెలుగు సంఘాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు ఇలాంటి పత్రాలే దొరికాయి. అంతేకాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు నటీమణులు కూడా తెలుగు సంఘాల ఆహ్వానం మేరకే వీసాలు పొందారు. వీసాలు పొందే సమయంలో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయానికి తెలుగు సంఘాల నుంచి అందిన ఆహ్వాన లేఖలనే సమర్పించారు. ఇవన్నీ నకిలీ లేఖలేనని అమెరికా పోలీసుల దర్యాప్తులో తేలింది.

కొద్ది రోజులుగా వరసబెట్టి తెలుగు సంఘాల ప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నారు. వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు నటీమణులను ఆహ్వానిస్తున్నది, లేనిదీ ఆరా తీస్తున్నారు. అనుమానంతో సంఘాల్లో ఉన్న ప్రతినిధులను మార్చిమార్చి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.ఇది వరకు అమెరికాలో ఒకటి రెండు తెలుగు సంఘాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంచుమించు ఆ దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక తెలుగు సంఘం ఉంటుంది. వీరంతా తరచుగా ఎదోఒక కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ రంగాలకు చెందిన అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ సంఘాలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరో చేసిన తప్పుకి వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu