బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో వారాంతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా తొలి స్థానంలో నిలిచింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజున రూ.34.75 కోట్లు రాబట్టి 2018లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. శనివారం రూ.38.60 కోట్లు, ఆదివారం రూ.46.71 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుడు చెబుతున్నారు. మూడు రోజుల్లో రూ. 120.06 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. సంజు చిత్రానికి రణబీర్ కపూర్ దర్శకత్వం వహించారు.
2018లో తొలి వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచిందని అంటున్నారు. ఈ వరుసలో “రేస్ 3”, “పద్మావత్’” “టైగర్ జిందా హై”లను ఈ బయోపిక్ అధిగమించినట్లు పేర్కొన్నారు. తొలివారంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదు సినిమాల జాబితాను ఓ సారి చూస్తే.. “సంజు” – రూ.120.06 కోట్లు.. “పద్మావత్” – రూ.114 కోట్లు (అన్ని భాషల్లో కలిపి), “రేస్ 3” – రూ.106.47 కోట్లు.. “బాఘి 2” – రూ.73.10 కోట్లు.. “రెయిడ్” రూ.41.01 కోట్లు..”బాహుబలి’” వసూళ్ల కన్నా ఎక్కువ. “సంజు” సినిమా ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. “బాహుబలి: ది కన్‌క్లూజన్” (హిందీలో మాత్రమే) మూడో రోజున దేశవ్యాప్తంగా రూ.46.50 కోట్లు వసూలు చేసింది. “సంజు” మూడో రోజున రూ.46.71 కోట్లు రాబట్టి ఆ సినిమాను అధిగమించడం విశేషం.