రాబోయే ఎన్నికల్లో ఒక్క కడపలోనే కాదు, రాష్ట్రంలో సీఎం చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవా..? కడపలో గెలవరని తెలిసి చంద్రబాబే, జగన్ చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డిని హతామార్చారా..? వివేకాను హతమార్చితే కడపలో తిరిగే నాయకుడు ఉండడని కుట్రపన్నారా..? తన చేతికి మట్టి అంటకుండా అదే కుట్రను వైఎస్ కుటుంబసభ్యులపై నెట్టేసే ప్రయత్నంచేశారా..? ప‌్రభుత్వ పరిపాలనపై ప్రజల్ని ఓట్లడిగే దమ్ములేని చంద్రబాబు కడపలో హత్యారాజకీయాలకు తెరతీశారా..? అంటే అవుననే అంటున్నారు వైసీపీ అధినేత జగన్.
తనకు, తన తండ్రికి పులివెందుల అంటే ఎంతో ప్రేమ అని, పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానని జగన్ అన్నారు. పులివెందులలో నామినేషన్ వేయడానికి ముందు సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కడపలో చంద్రబాబు చేస్తున్న హత్యా రాజకీయాల్ని ఏకరవుపెట్టారు.
కడపలో గెలవరనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జగన్ సూచించారు. చంద్రబాబు ఐదేళ్ల మోసాల పాలన, అబద్ధపు పాలన , అన్యాయపు, కుట్రలు, మోసపు పాలనతో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకే కుట్రలు ప్రారంభించారని చెప్పారు. చిన్నాన్నను చంపితే జమ్మలమడుగులో ఎవరూ తిరగరని ఆయనను చంపేశారు. ఈ నెపాన్ని కుటుంబసభ్యులపై నెట్టేసి, అరెస్ట్ చేస్తే పులివెందులలో ఎన్నికలు జరగకుండా ఉండేదుంకు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు.
ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ లు చేస్తుంటే చంద్రబాబు తన పార్టీ ముఖ్యనేతలతో మరో మూడురోజుల్లో దహనాలకు, హత్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారని, ఆ నేరాన్ని వైసీపీపై నెట్టేద్దామని చెప్పారట. అంటే దానర్ధం ప్రభుత్వ పాలనపై ఓట్లడిగే సత్తా లేక, ప్రభుత్వ పాలపై ఇప్పటికే విసిగెత్తిన ప్రజల దృష్టిమరల్చేందుకు చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనపై ఎన్నికలు జరగకుండా..కడపలో జరుగుతున్న కడపలో హత్యా రాజకీయాలపై ఎన్నికలు జరగేలా చేస్తున్న చంద్రబాబు కుట్రల్నిచూస్తుంటే తనకు బాధేస్తుందని జగన్ పునరుద్ఘాటించారు.