HomeTelugu Newsచంద్రగిరిలో టీడీపీకి చుక్కలు వెనుక కథ ఇదీ..

చంద్రగిరిలో టీడీపీకి చుక్కలు వెనుక కథ ఇదీ..

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉప ఎన్నికల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయమే టీడీపీ కొంప ముంచిందని సమాచారం. పోలింగ్ జరిగి నెల రోజుల తర్వాత నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎస్ ఆదేశించడంతోనే జరిగాయని చంద్రబాబు, టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
chandrababu naidu
చంద్రగిరిలో రీపోలింగ్ వద్దని టీడీపీ డిమాండ్ చేసినా.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పట్టించుకోకపోవడం విశేషం. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫిర్యాదు చేయగానే దాన్ని పరిగణలోకి తీసుకొని సీఎస్ నేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదికి లేఖ రాయడం.. ఆయన రీపోలింగ్ కు సిఫార్స్ చేయడం జరిగిపోయింది.
అయితే పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఈవోకు ఫిర్యాదు చేయకుండా సీఎస్ ఎల్వీకి ఎందుకు చెవిరెడ్డి ఫిర్యాదు చేశారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రం సంబంధం లేని విషయంలో సీఎస్ ఎందుకు జోక్యం చేసుకున్నారని.. టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
సీఎం చంద్రబాబుతో మొన్ననే వివాదాన్ని పరిష్కరించుకున్న సీఎస్.. ఇప్పుడు మళ్లీ టీడీపీకి వ్యతిరేకంగా వేలు పెట్టడంతో వివాదం ముదిరిపోయింది. మళ్లీ సీఎస్ వర్సెస్ చంద్రబాబు ఫైట్ మొదలు కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu