HomeTelugu Big Stories'గ్రీన్ ఛాలెంజ్' స్వీకరించిన మోహన్‌బాబు

‘గ్రీన్ ఛాలెంజ్’ స్వీకరించిన మోహన్‌బాబు

పర్యావరణ పరిరక్షణలో భాగంలో ‘గ్రీన్ ఛాలెంజ్’ పేరుతో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా.. కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేథరిన్‌ హడ్డా.. తిరిగి ఆ సవాల్‌ని నటుడు, నిర్మాత మోహన్‌బాబుకు విసిరింది. దీంతో ఆ సవాల్‌ను స్వీకరించిన మోహన్‌బాబు తన విద్యానేకేతన్‌ స్కూల్‌ పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా ఇందుకు సంబంధంచిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ”ఛాలెంజ్ కంప్లీట్ చేశా.. విద్యానికేతన్ స్కూల్ పిల్లలు కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నా. మొక్కలు నాటి.. మీ ఫొటోలు నాకు పంపండి” అనే ట్యాగ్‌ ఎడ్‌ చేశారు.

7 18

ఈ నెల 27న దివంగత రాష్టపతి అబ్దుల్‌ కాలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ‘హరితహారం’లో భాగంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత, సైనా నెహ్వాల్‌, రాజమౌళి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన ఫొటోలు షేర్‌ చేసిన సంగతి తెలిసిందే

Recent Articles English

Gallery

Recent Articles Telugu