గుంటూరు టాకీస్ కు సీక్వెల్
బుల్లి తెర యాంకర్ గా అందరికీ సుపరిచితురాలైన రష్మి హీరోయిన్ గా, సిద్దు హీరోగా, నరేష్ కీలక పాత్రలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆర్.కె బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో అడల్ట్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గానూ మంచి విజయం సాధించింది.
ఈ తరుణంలో ఆర్ కె బ్యానర్ అధినేత రాజ్ కుమార్ గుంటూరు టాకీస్ కు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గుంటూరు టాకీస్ సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ సీక్వెల్ లో గుంటూరు టాకీస్ సినిమాలోని నటులతో పాటు, సీనియర్ కమెడియన్స్, నటులు కూడా నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.