HomeTelugu Reviewsగీత గోవిందం మూవీ రివ్యూ

గీత గోవిందం మూవీ రివ్యూ

అర్జున్‌ రెడ్డి సినిమాతో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ.. మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైరన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా విజయ్‌ చేసిన గీత గోవిందం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది… ఈ గీత గోవిందం ప్రేమ కథ ఏంటి.. అనేది కథ..

7a 4

కథ: విజయ్‌ గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) ఓ క‌ళాశాల‌లో లెక్చ‌ర‌ర్‌. చిన్నప్పటి నుంచి చాలా పద్దతిగా పెరిగిన అబ్బాయి. చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు విని పెరిగిన అబ్బాయి. అంతే ప‌ద్ధ‌తైన, సాంప్రాదాయబద్దంగా, తన అమ్మలాగే ఉండాలని కలలు కంటుంటాడు. అలా ఓ అమ్మాయి వేంట 6 నెలలు తిరిగుతాడు ఆ తరువాత ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందని తెలుసుకుని నిరుత్సాహపడతాడు. కొద్ది కొద్ది రోజులకు గీత (రష్మిక మందన్న)ను గుడిలో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. లాగైన ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన చెల్లికి పెళ్లి కుదరటంతో కాకినాడ బయలుదేరుతాడు విజయ్‌. గీత కూడా అదే బస్సులో విజయ్‌ పక్కన సీటులోనే కూర్చుంటుంది. ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలనుకున్న విజయ్‌, ఫ్రెండ్స్‌ చెప్పిన చెత్త సలహాల కారణంగా ఆమె దృష్టిలో ఓ రోగ్‌ అనిపించుకుంటాడు. అలా గీతకు దూరమైన విజయ్‌ తిరిగి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..? ఈ మధ్యలో గీత, గోవింద్‌ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు : విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డి తరువాత చేస్తున్న చిత్రం కావడం, అదే కాకుండా గీత ఆర్ట్స్ నుంచి వ‌స్తుండడంతో `గీత గోవిందం`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాలో పూర్తి కాంట్రాస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌ అభిన‌యం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. విజ‌య్ మంచి కామెడీ టైమింగ్‌ని ప్ర‌ద‌ర్శించాడు. అర్జున్‌రెడ్డి త‌ర్వాత త‌న‌కి త‌గ్గ క‌థ‌ని ఎంచుకుని… అందుకు త‌గ్గ‌ట్టుగానే అభినయం ప్ర‌దర్శించాడు. భావోద్వేగాలు కూడా బాగా పండించాడు. విజయ్‌ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌తో ప్రతీ సీన్‌లోనూ ఫన్‌ జనరేట్ చేయటంలో విజయ్ దేవరకొండ్ సక్సెస్‌ అయ్యాడు. ర‌ష్మిక అందం… అభిన‌యం చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, గీత పాత్రలో టాలీవుడ్‌కు మరింత చేరువయ్యారు. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్‌ చాలా బాగా చూపించారు. చాలా సన్నివేశాల్లో విజయ్‌ దేవరకొండతో పోటి పడి నటించారు. చేయటంలో విజయ్ దేవరకొండ్ సక్సెస్‌ అయ్యాడు. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించే సెంటిమెంట్‌ను పండించాడు. చాలా రోజుల తరువాత సుబ్బరాజుకు మంచి పాత్ర దక్కింది. ఇతర పాత్రల్లో రాహుల్‌ రామకృష్ణ, నాగబాబు, గిరిబాబు, అన్నపూర్ణ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

7 13

విశ్లేషణ: విజయ్‌ దేవరకొండను అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్‌ స్టైల్‌లో చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు. ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న పరశురామ్‌. మరోసారి తనదైన కామెడీ, ఎమోషనల్‌ టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాత కథే అయినా.. కథనం, డైలాగ్స్‌తో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించాడు. దర్శకుడిగానే కాదు రచయితగాను ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. కావాలని కామెడీ సీన్స్‌ను ఇరికించకుండా లీడ్‌ క్యారెక్టర్స్‌తోనే మంచి కామెడీ పండించాడు. ఎమోషనల్‌ సీన్స్‌ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. తరువాత వచ్చే ఎం‍టర్‌టైన్మెంట్‌తో అన్ని కవర్‌ అయిపోతాయి. తొలి భాగం ఎంటర్‌టైనింగ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ఈ సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్ గోపిసుందర్‌ సంగీతం. కథలో భాగంగా వచ్చిపోయే పాటలు ఆడియన్‌ను మరింతగా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ చేసేస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు ఇలా అన్ని సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిగ్గా కుదిరాయి.

హైలైట్స్
నటీనటులు
కామెడీ సీన్స్‌

డ్రాబ్యాక్స్
ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

చివరిగా : కామెడీ ఎంటర్‌టైనర్‌
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

సినిమా : గీత గోవిందం
నటీనటులు : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాతలు: బన్నీ వాస్‌
సంగీతం : గోపి సుందర్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

అర్జున్‌ రెడ్డి సినిమాతో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ.. మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైరన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా విజయ్‌ చేసిన గీత గోవిందం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది... ఈ గీత గోవిందం ప్రేమ...గీత గోవిందం మూవీ రివ్యూ