విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహించగా రష్మికా మండన్నా హీరోయిన్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘ఇంకేం.. ఇంకేం.. ఇంకేం కావాలే..’ తోనే గీత గోవిందంపై అంచానాలు రెట్టింపు అయ్యాయి. ఈ టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది.
‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ కలలు కనడం, హీరోయిన్ చెంపదెబ్బతో ఈ లోకంలోకి రావడం.. ఇంకొక్కసారి అమ్మాయిలు.. ఆంటీలు.. ఫిగర్లు అంటూ తిరిగావంటే యాసిడ్ పోసేస్తా.. అంటూ హీరోయిన్ వార్నింగ్ ఇవ్వడం… మొత్తంగా చూస్తే.. ఓ రొమాంటిక్ కామెడీ సినిమాగా గీత గోవిందం రాబోతుందనే ఫీలింగ్ కనిపిస్తోంది. ఇక మారవా అంటూ హీరోయిన్ డైలాగ్.. లేదు మేడం, ఐ యామ్ కంప్లీట్లీ డిసెంట్ నౌ అనడం వంటి డైలాగ్స్ ఈ చిత్రంపై మంరిత ఆసక్తి కలిగిస్తున్నాయి.