పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత ‘హరితహారం’ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాంలో భాగంగా ప్రారంభమైన ‘గ్రీన్ ఛాలెంజ్’ ఓ ఉద్యమంలా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమాంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తూ.. రాజకీయ నేతల నుంచి సినీ, క్రీడా ప్రముఖుల వరకూ చేరింది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ చేసిన సవాల్‌ను నటుడు అక్కినేని నాగార్జున స్వీకరించారు.
ఈ సందర్భంగా తమ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లోని గార్డెన్లో సిబ్బందితో కలిసి నాగార్జున మొక్కలు నాటారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘డియర్ ఎంపీ సంతోష్.. మీకు మాటిచ్చినట్లే అన్నపూర్ణ స్టూడియోస్‌లో నా సభ్యులతో కలిసి మొక్కలు నాటాను. ఇక మీ వంతు స్నేహితులారా..! శివరాజ్ కుమార్, కరణ్ జోహార్, కార్తి, ధనుష్, నా కోడలు సమంతలను ఈ ఛాలెంజ్‌ను ముందుకు నడిపించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు రాజమౌళి, మహేశ్ బాబు, మోహన్‌బాబు, వంశీ పైడిపల్లి, చిరంజీవి, పవన్ కల్యాణ్, వి.వి.వినాయక్ తదితరులు పాల్గొన్నారు.