ఆంద్ర ప్రదేశ్ విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ కొత్త రికార్డు సృష్టించింది… రాష్ట్ర విభజన తర్వాత… సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్… నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విజయవాడపై ఫోకస్ పెట్టడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చింది. ప్రయాణికుల సంఖ్య గత ఏడాది 3 లక్షలు మాత్రమే ఉంటే… ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకు చేరడం విశేషం. గన్నవరం ఎయిర్‌పోర్ట్ చరిత్రలోనే ఇంత సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. ఇక రానున్న రోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.