తెలుగులో తొలి చిత్రం ‘భరత్ అనే నేను’ తో మంచి విజయం అందుకున్నారు కైరా అద్వాణీ. ఇప్పుడు రామ్‌చరణ్‌కు జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు… అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్‌పై భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఘట్టం కోసం దాదాపు రూ.5 కోట్ల విలువైన భారీ సెట్‌ను వేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దానితో కైరా కు కొంచెం విరామం దొరికింది.
ఈ సందర్భంగా కైరా..ఈరోజు నాకు హాలిడే. హైదరాబాద్‌లో మంచి ప్రదేశాలుంటే చెప్పరూ..’ అంటూ ట్విటర్ ద్వారా నిన్న అభిమానులను అడిగిన సంగతి తెలిసిందే. దాంతో ఎందరో నెటిజన్లు తమకు తోచిన సలహాలు చెప్పారు. ఓ నెటిజన్ మాత్రం ‘మీరు తెలుగులో నటించిన తొలి సినిమా ‘భరత్ అనే నేను’ హీరో మహేష్ బాబు ఇల్లు చూసిరండి’ అని సలహా ఇచ్చాడు.
దాంతో కైరా అతని సలహాకే ఓటేశారు. నిన్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇంటికి వెళ్లారు. మహేష్ సతీమణి నమత్ర, కుమార్తె సితారలతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మీ సలహాలకు ధన్యవాదాలు. నాకు కొద్ది గంటల సమయమే ఉన్నందున కొన్ని ప్రదేశాలకు మాత్రమే వెళ్లగలిగాను. మహేశ్‌బాబు నివాసం, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంకు వెళ్లాను. ఈరోజు చాలా బాగా గడిచింది’ అని ట్వీట్ చేశారు కైరా.