కేరళ వరద భాదితుల సహాయ నిధి కోసం అక్కడి ప్రభుత్వానికి సహాయం అందించేందుకు మన తెలుగు సినీ పరిశ్రమ తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సహాయాన్ని ప్రకటించగా ఇప్పుడు ‘గీత గోవిందం’ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 ముందుకొచ్చింది.
నిన్న విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం కేరళలో కూడ పలు చోట్ల రిలీజై మంచి షేర్ ను రాబట్టింది. ఈ షేర్ మొత్తాన్ని వరద సహాయ నిధికి అందజేయాలని గీత ఆర్ట్స్ 2 నిర్ణయించుకున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి బన్నీ వాస్ తెలియజేశారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే విజయ్ దేవరకొండ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.