కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకొని విలవిలాడుతుండటంతో కీర్తి సురేష్ ఆ ప్రాంతానికి తన విరాళం అందజేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి కీర్తి సురేష్ సొంత ప్రాంతం కేరళ. కేరళ సిఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షలు విరాళమిచ్చిన ఆమె ఇంకో 5 లక్షల రూపాయలు విలువ కలిగిన బట్టలు, మెడిసిన్స్, నిత్యావసర వస్తువుల్ని స్వయంగా కేరళ వెళ్లి బాధితులకు అందజేయనున్నారు. స్టార్ గా ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత ప్రాంతాన్ని మర్చిపోని కీర్తి సురేష్ ను అభినందించాల్సిందే.
అదేవిధంగా నటి పూనం పాండే కూడా మంచి మనసు చాటుకున్నారు. ఆమె ప్రస్తుతం తెలుగులో కె.వీరు దర్శకత్వంలో ‘లేడీ గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు. ‘లేడీ గబ్బర్ సింగ్’కు తీసుకునే మొత్తం పారితోషికాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చిత్ర పరిశ్రమలోని తన స్నేహితులు, అభిమానులు కూడా ముందుకు రావాలని కోరారు. పూనం తెలుగులో ‘మాలిని అండ్ కో’ అనే సినిమాలో నటించారు.