ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అంశం ఇండస్ర్టీని కుదిపేస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై అనేకమంది నటీమణులు గొంతు విప్పగా తాజాగా మెగా డాటర్ నిహారిక కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయం తెలియజేసింది. కాస్టింగ్ కౌచ్ ప్రతి చోటా ఉంటుందని తాను కూడా విన్నానని అన్న ఆమె.. ఎవరూ అమ్మాయిల్ని చేయి పట్టుకుని బలవంతం చేయరని, అంగీకారం లేకుండా అలా చేస్తే అది ఖచ్చితంగా రేప్ కిందికే వస్తుందని అన్నారు. అయినా భాద్యులు అంటున్న వాళ్ళు ఎస్ అనకుండా అవతలి వాళ్ళు ఏమీ చేయలేరని కూడా అన్నారు.
మాకు ఈ మార్గం తప్ప మరో దారి లేదు అంటే దాని గురించి మాట్లాడడం కష్టం. నేను వచ్చిన నేపథ్యం వేరు కాబట్టి వారి కోణంలో నేను ఆలోచించలేను అని నిహారిక తెలిపింది. నేను సినిమాల్లోకి వస్తున్నానంటే వాళ్ళ సొంత చెల్లి, కూతురు వచ్చినట్లుగా అభిమానులు భావిస్తారు. గ్లామర్ విషయంలో కూడా ఓ పరిధి వరకే ఉండాలని భావిస్తున్నాను అని తెలిపింది. మరి ఈ కామెంట్స్ పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.