ప్రపంచవ్యాప్తంగా కీకీ చాలెంజ్ ఫేమస్ అయింది. ఎంతో మంది ప్రమాదాల భారిన పడ్డారు కూడా. ఈ చాలెంజ్ మన దేశంలోనూ విస్తరించి హల్చల్ చేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ఆదా శర్మ, రెజీనాలు కీకీ చాలెంజ్‌ను స్వీకరించారు. పోలీసులు ఈ చాలెంజ్‌ను నిషేదించడంతో కొంతవరకు దీని హవా తగ్గింది. ఇప్పుడు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ ‘కికి’ సవాల్ స్వీకరించారు. ఈ కీకీ చాలెంజ్‌ను వెరైటీగా ప్రయత్నించారు. కదిలే కారులోంచి కాకుండా.. వీల్ చైర్లోంచి దిగి విభిన్నంగా చేశారు ఇద్దరు కలిసి పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఛాలెంజ్ స్వీకరించడానికి కన్నా ముందు జాగ్రత్త ఎంతో అవసరమని హెచ్చరించారు. పాపులర్ ‘కికి’ సందడిలో మేమూ పాల్గొన్నామని, ఇది తమకు నచ్చిందని చెప్పారు. కానీ దీని కన్నా రూల్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టమని పేర్కొన్నారు. తమ కొత్త సినిమాలోని యాక్షన్ సన్నివేశం షూట్ సమయంలో ఇలా సరదాగా డ్యాన్స్ చేసినట్లు తెలిపారు.
వీడియోలో కాజల్, బెల్లంకొండ బ్యాండేజ్ వేసుకుని కనిపించారు. సినిమా సన్నివేశంలో భాగంగా వారిద్దరు అలా తయారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరు జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది.ప్రముఖ గాయకుడు డ్రేక్ పాడిన పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’. ‘కికి’ అని మొదలయ్యే ఈ పాట చాలా పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ హాస్య నటుడు షిగ్గి ‘ఇన్ మై ఫీలింగ్స్'(‘కికి’) పేరుతో సోషల్‌మీడియాలో ఛాలెంజ్ ప్రారంభించారు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.
Joining in the bandwagon, better late and safer! Our very conscious version. किकी we लव you(but we love rules more)@hydcitypolice
Madness we do on set while shooting an action sequence,with my Star of a partner-in-humour @BSaiSreenivas #InMyFeelingsChallenge #kikichallange @Drake pic.twitter.com/W65N3KBOXX— Kajal Aggarwal (@MsKajalAggarwal) August 12, 2018