గతంలో కళ్యాణ్ రామ్ ‘ఓం’ అనే 3డి చిత్రాన్ని కెమెరామెన్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో చేసారు. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు మరోసారి తన తదుపరి చిత్రానికి కెమెరామెన్ ని దర్శకుడుగా ఎంచుకున్నారు. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. ‘ఆర్య, అతడు, జల్సా, ఆగడు’ వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన గుహన్ దర్శకుడుగా మారబోతున్నారు. కళ్యాణ్ రామ్ తో ఈయన సినిమా చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.అడ్వెంచరస్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ మళ్లీ తప్పు చేస్తున్నాడని ,కొందరు అంటున్నారు. అయితే గుహన్ వంటి టాలెంటెడ్ కెమెరామెన్ దర్శకత్వంలో వచ్చే చిత్రం ఖచ్చితంగా అద్బుతంగా ఉండే అవకాసం ఉందని మరికొందరు అంటున్నారు. కళ్యాణ్ రామ్ తాజా సినిమాలు ‘ఎం.ఎల్.ఏ’ మార్చి 30 న విడుదల కాబోతోంది. అలాగే ‘నా నువ్వే’ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.