అనంతపురం, స్వామిరారా, అష్టాచెమ్మా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న స్వాతి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. కలర్స్ ప్రోగ్రామ్స్ ద్వారా యాంకర్ గా జీవితాన్ని ప్రారంభించిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. యాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో బహుముఖ పాత్రలు పోషించిన స్వాతి..మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఫైలెట్ వికాస్ ను వివాహం చేసుకోబోతున్నది.
వీరిద్దరిది లవ్&ఆరెంజ్డ్ మ్యారేజ్. ఇరు కుటుంబాల వారు వీరి వివాహానికి ఒప్పుకున్నారట. ఆగస్టు 30 న హైదరాబాద్ లో వివాహం జరగబోతున్నది. వివాహం అనంతరం కొచ్చిన్ లో రిసెప్షన్ ఉంటుందట. వికాస్ ఇండోనేషియాలోని జకార్తాలో ఉంటున్నాడు. వివాహం తరువాత 30 సంవత్సరాల స్వాతి భర్తతో పాటు జకార్తాలోనే ఉండబోతుందట. అంటే వివాహం అనంతరం స్వాతి ఇండస్ట్రీకి దూరమైపోతుందన్నమాట.