‘విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంతగా ఎవరికీ వర్తించవేమో.. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్’ శవపేటిక మీద తమిళంలో ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికి మీద కొడుకు స్టాలిన్‌తో చెప్పిన వ్యాఖ్యాలను చెక్కించారు.