HomeTelugu Newsకమెడియన్‌గా భారీగా రెమ్యునరేషన్‌ తగ్గించేసిన సునీల్‌

కమెడియన్‌గా భారీగా రెమ్యునరేషన్‌ తగ్గించేసిన సునీల్‌

కమెడియన్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన సునీల్‌ తరువాత హీరోగా మారి.. మళ్లీ కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హిట్టూ.. ఫట్‌లతో సంబంధం లేకుండా సునీల్ తన పాత్ర పరంగా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. కమెడియన్‌గా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలూ హిట్టే. కానీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. హీరోగా మారిన తర్వాత కమెడియన్ పాత్రలకు స్వస్తి చెప్పిన సునీల్‌ ఇప్పడు మళ్లీ కమెడియన్ పాత్రల్లో కూడా నటించేందుకు పచ్చజెండా ఊపాడు.

2 1

సునీల్‌ ప్రస్తుతం హీరోగా కూడా సిల్లీ ఫెలోస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సునీల్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. కాగా తాజాగా అరవింద సమేత చిత్రం ద్వారా మళ్లీ కమెడియన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే హీరోగా రూ.4కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకున్న సునీల్ ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నాడట. ఈ సినిమాకు ఆయన కోటిన్నర పారితోషికంతో సరిపెట్టుకున్నాడట. ఇక కమెడియన్‌గా సునీల్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఇక వెండి తెరపై సునీల్‌ నవ్వులు పూయించడం కాయం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu