HomeTelugu Big Storiesఏ పనిచెయ్యాలన్న నాన్నగారే నాకు ఆదర్శం

ఏ పనిచెయ్యాలన్న నాన్నగారే నాకు ఆదర్శం

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్ హాస్పిటల్‌ 18 వ వార్షకోత్సవ వేడకలు ఘణంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎంపీ కవిత, ఆసుపత్రి చైర్మన్‌, హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రేయ, డైరెక్టర్‌ బోయపాటి మొదలైనవారు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎంపీ కవిత. బాలకృష్ణ. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లడుతూ…

8 14

1989 లో 40 పడకలతో ఈ క్యాన్సర్ హాస్పిటల్‌ ను ప్రారంభిస్తే..దానినే బాలకృష్ణ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం అభినందనియం.బాలకృష్ణ బ్లడ్‌లోనే సేవగుణం ఉంది.బాలకృష్ణకి తెలుగు భాష పట్ల అభిమానం ఎక్కువ. బాలకృష్ణ నిర్మిస్తున ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం బాగా రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు క్యాన్సర్‌ ఎలా ఎదుర్కొవాలో తెలుసుకోవాలి. క్యాన్సర్‌కు సంబంధించి ప్రభుత్వం వైద్యం అంతగా అందుబాటులో లేదు. జిల్లాకో క్యాన్సర్‌ స్క్రినింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌ చెకప్‌ చేయించుకోవాలి. సీఎం కేసీఆర్‌ గారు ఆరోగ్యశాఖ పై ప్రత్యక శ్రద్ద పెట్టారు అని తెలిపారు.

బాలకృష్ణ మాట్లడుతూ..నేను ఏ పనిచెయ్యాలన్న నాన్నగారే నాకు ఆదర్శం. మేము ఒకళ్ల ట్రెండ్‌ ఫాలో కాము..ట్రెండ్‌ సెట్‌ చేస్తాం. మా అమ్మ క్యాన్సర్ వ్యాధితో మరణించారు.. ఆమె కోరిక మేరకు బసవతారకం ఎన్టీఆర్‌ ప్రారంభంచారు. 40 పడకలతో ప్రారంభించిన హాస్పిటల్‌ 500 పడకల పైగా అభివృధి చెందింది. రోగి క్యాన్సర్ వ్యాధి కంటే..భయంతోనే సగం మంది మరణిస్తారు.. కానీ హాస్పిటల్‌లో వైద్యలు చూపేకే సగం క్యాన్సర్ పోతుంది .బెస్ట్‌ మేనేజ్మెంట్‌ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్‌ ఒక విజన్‌తో హాస్పటిల్‌ స్థాఫించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నాము. ప్రపంచ స్థాయిలో ఉన్నఅధునాతన పరిజ్ఞానం హాస్పిటల్‌ లోకి తెస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్‌ ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. తెలుగురాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఎన్టీఆర్‌ శిష్యులే. క్యాన్సర్ గురించి ఎవ్వరూ బయపడకండి..అందరికి బసవతారకం అండగా ఉంటుంది అన్నారు.

శ్రియ..అందరు రెగ్యూలర్‌గా మెడికల్‌ చెకప్‌ చేయించుకోవాలి. బసవతారకం  క్యాన్సర్ హాస్పిటల్‌ వేడుకల్లో పాల్గోనడం ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్‌ ఏంతో మందికి పునర్జన్మని ఇస్తోంది అన్నారు. బోయపాటి.. ఎన్టీఆర్‌ ఒక బాధ్యతగా భావించి బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ ప్రారంభించారు.బసవతారకం హాస్పిటల్‌ ఏషియాలోనే నెంబరు వన్‌ గా ఉండాలని కోరుకుంటున్న. పది లక్షల రూపాయలను ఈ హాస్పిటల్‌కి డొనేట్‌ చేస్తున్నను అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu