HomeTelugu Trendingఏపీ సీఎం చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్

ఏపీ సీఎం చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 16 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు వారెంట్‌ జారీ చేసింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఉదయం నుంచే ఇలాంటి ఊహాగానాలు విన్పిస్తున్నప్పటికీ తాజాగా సీఎం చంద్రబాబుకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 2010సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు వెళ్లారు. ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది.

10 8
దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అయినా బాబ్లీ ప్రాజెక్టు సందర్శించిన తరువాతే వెళ్తామని పట్టుపట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అమలులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి కారణలతో చంద్రబాబు పై కేసు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇటీవలే చంద్రబాబు కోర్టుకు హజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై చంద్రబాబు, టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu