అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలిని పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి కానీ వాటిలో ఏదీ సంతృప్తిగా అనిపించలేదు. ప్రేక్షకులను మెప్పించే కథ కోసం ఎదురు చూస్తున్నాను అంటోది షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమా ఛాలెంజ్‌గా తీసుకుని నటించాను. ఆ సినిమాకు న్యాయం చేయగలనా లేదా అనుకున్నాను. దర్శకుడు ప్రోత్సాహంతో బాగా నటించగలిగానని చెబుతోంది. అర్జున్ రెడ్డి వంటి చిత్రం తొలి సినిమాగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నాది ముంబై కావడంతో తెలుగులో మొదటి సినిమా చాలా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నా.. త్వరలోనే తమిళంలో కూడా నటిస్తాను అన్నారు. అయినా నటనకు భాష ఏమాత్రం అడ్డం కాదని అంటోంది షాలిని పాండే.
ప్రస్తుతం షాలిని పాండే తమిళంలో జీవీ ప్రకాష్‌తో “100% కాదల్” సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నారు. ఈ చిత్రం మరో ఖుషిలా ఉండబోతుందని అన్నారు. జీవీ ప్రకాష్, నాకు మధ్య జరిగే ఇగో, ప్రేమ, చిలిపి పోరాటాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. మరో వైపు జీవాతో “గొరిల్లా” చిత్రంలో నటిస్తున్నారు. హాస్యం ప్రధానం తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం బ్యాంకాక్, చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంది. అన్ని రకాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీశారని అంటోంది షాలిని పాండే. త్వరలోనే గొరిల్లా చిత్రం తెరపైకి రానుంది.