‘బిగ్ బాస్’ షోతో బుల్లితెరకు వ్యాఖ్యాతగా పరిచయమయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎక్కువ పారితోషికం లభించడం, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేకపోవడంతో ఆ షో చేయడానికి అంగీకరించాడు. ‘బిగ్ బాస్’ షో అంటేనే కాంట్రవర్సీ తప్పనిసరి. కాంట్రవర్సీ లేకుండా షో హిట్ అయ్యే ఛాన్సులు తక్కువ. అయితే తెలుగు వెర్షన్ కు మాత్రం అటువంటి కాంట్రవర్సీలు లేకుండా చూసుకుంటామని నిర్వాహకులు చెప్పడంతో ఎన్టీఆర్ కూడా ముందుకు వచ్చాడు. అయితే భారీ ఖర్చుతో నిర్వహిస్తోన్న ఈ షో క్లిక్ అవ్వాలంటే ఖచ్చితంగా కావల్సినంత మసాలా అందులో ఉండాల్సిందే. దీంతో ఎన్టీఆర్ ను నొప్పించకుండా, బిగ్ బాస్ షో ను ఆసక్తికరంగా తీర్చిదిద్దడానికి మార్గాలను అన్వేషిస్తున్నారట కార్యనిర్వాహకులు.
ప్రస్తుతమయితే ఈ షోకు వస్తోన్న స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఇలాగే గనుక కొనసాగితే టీఆర్పీ రేటింగులు రావడం కూడా కష్టమవుతుంది. అందుకే ఈ షోకి కాస్త మసాలా యాడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన ఇమేజ్ కు డ్యామేజ్ కలగకుండా ఉండేలా కొందరిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. వారి నుండి అనుమతి లేనిదే షోలో కొన్ని జరగడం లేదని టాక్. కావాలనే ఎన్టీఆర్ ఈ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి వివాదాలు లేకుండా షోని ఎలా హిట్ చేస్తారో.. చూడాలి!