వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే మొదలుకావాల్సివుంది. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఈసినిమా ప్రారంభం కాకుండానే ఈ సినిమా పై ఇప్పటికే అనేక గాసిప్పులు హడావిడి చేసాయి. వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పటివరకు జూనియర్ ఏసినిమాలోను కనిపించని విధంగా ఎన్టీఆర్ లుక్ ఉండాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ స్టీవెన్స్ సమక్షంలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
