తెలుగు జాతి ముద్దు బిడ్డ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాపైనే టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కువ ఊహాగానాలు నడస్తున్నాయి. ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర గురించి ఎవరు చేయబోతున్నారనే దానిపై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితంలో ఆయనతో కలిసి పనిచేసిన కొందరు తారల స్థానంలో ఎవరిని తీసుకుంటారా అనే సందేహాలు కలగక మానవు. తాజాగా ఓ కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.
ఎన్టీఆర్ హయాంలోని ఏఎన్నార్, కృష్ణ పాత్రల గురించి కొత్త రూమర్‌లు వినిపిస్తున్నాయి. ఏఎన్నార్ పాత్రలో ఇప్పటికే మహానటిలో సినిమాలో నటించి మెప్పించిన నాగచైతన్యను తీసుకోబోతున్నారని.. అలాగే సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తుందని.. జయప్రద పాత్రను తమన్నా చేస్తుందని గతంలో పలు ఊహాగానాలు వినిపించాయి. అప్పట్లో ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య చాలా విరోధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్టీఆర్ తీద్దామనుకున్న అల్లూరి సీతారామరాజు సినిమాను కృష్ణ ముందుగానే తీయడంతో వీరిద్ధరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్.. చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.