జానియర్ ఎన్టీఆర్, ప్రణతిల పెద్ద కుమారుడు అభయ్ రామ్ ఎంత అల్లరివాడో అభిమానులకు తెలిసిందే. ఒక్కోసారి అభయ్ చేసే అల్లరి చేష్టలను తారక్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తారక్ తన కుమారుడు అభయ్‌కి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అభయ్ తన తండ్రి ఒడిలో కూర్చుని చెంపలు వాయిస్తూ కన్పించాడు.
ఈ వీడియోకు తారక్..’నా కుమారుడికి నేను పంచింగ్ బ్యాగ్ అయిన వేళ..’ అని సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. కరాటే కిడ్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. దీన్ని బట్టి చూస్తే అభయ్ కరాటే నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విద్యలన్నీ తన తండ్రిపై ప్రదర్శిస్తున్నట్టున్నాడు. ఇటీవల తారక్, ప్రణతి దంపతులకు రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అతనికి భార్గవ్ రామ్ అని నామకరణం చేశారు.ప్రస్తుతం తారక్ ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో బిజీగా ఉన్నారు.