ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూమార్తె, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పాత్ర గురించి ఆసక్తికరమైన పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
భువనేశ్వరి పాత్రలో మలయాళ భామ మంజిమా మోహన్ నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మంజిమ నాగచైతన్యకు జోడీగా నటించారు. ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ త్వరలో హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. సినీ కెరీర్‌కు సంబంధించి ఎన్టీఆర్ అనేక మందితో కలిసి పనిచేశారు. కాబట్టి వారి పాత్రల్ని కూడా ఈ బయోపిక్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, హెచ్.ఎం. రెడ్డి, చక్రపాణి, ఎస్వీఆర్, కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రలు సినిమాలో ఉన్నట్లు తెలిసింది.