తెలుగులో తొలి పూర్తిస్థాయి న్యూస్ ఛానల్ టీవీ 9 సక్సెస్ కు తానే కారణమని చెప్పుకునే రవిప్రకాష్ చివరకు జైలు పాలయ్యాడు. టీవీ 9 లో ఎంతోమందిని నానారకాలుగా హింసించి వారి ఉసురు పోసుకున్నాడు. అనేకమంది ఉద్యోగులను రోడ్డుకీడ్చాడు. తన కోపానికి అనేకమందిని బలితీసుకున్నాడు. కనికరం లేకుండా డెస్కుల్లో అనేకమందిని ఇళ్లకుపంపించాడు. డెస్కుల్లో ఎంతమంది మారారో లెక్కేలేదు. టీవీ 9 సక్సెస్కు పునాదులు వేసిన అరుణసాగర్ వంటివాళ్లను కూడా వదిలిపెట్టలేదు ఈయన. చివరకు ఖైదీ నెంబర్ 4412గా మిగిలాడు. ఆయన రాజ్యంలో అయన మాటే వేదం
సంస్థకు సీఈఓ కాబట్టి అయన చెప్పిందే మాట, అయన ఆడిందే ఆట. మొదటి నుంచి ఆయనకు అలా సాగింది. సంస్థలో అయన మాటే నడుస్తుంది. కనీసం తనకింద పనిచేసే ఉద్యోగులను సంతోషంగా ఉంచలేదు ఈయన. తన భజనపరులకి, తనకు లబ్ది చేకూర్చినవారికి మాత్రమే న్యాయాం చేసాడు. ఎంతలా అంటే… రవిప్రకాశ్‌ను పీకేసే వరకు చాలా మంది పని చేయకుండానే నెలానెలా వేలు, లక్షల జీతాలు తీసుకున్నారు. మిస్టర్‌ఛీటర్‌కు… బయట వ్యవహారాలు చూసే వాళ్లను ఉద్యోగులుగా చూపి నెలనెలా జీతాలు అందించిన ఘనత ఇతడిది. అసలు ఉద్యోగులు ఎవరో, పని చేయని వారు ఎవరో తెలియక కొత్త యాజమాన్యం పడిన లెక్కల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వీరు కాక… డ్రైవర్లు, ఆఫీస్‌బాయ్‌లు, హౌస్‌కీపింగ్‌ఉద్యోగులు… ఇలా చాలా మందే టీవీ9 నుంచి జీతాలు తీసుకుని ఆర్పీ సొంత పనులు చేశారు. ఇవన్నీ ఆర్పీని పీకేసిన తర్వాత బయటపడ్డాయి. అవే ఉన్న ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.
బోనస్లకూ రెక్కలు
టీవీ9 విక్రయం జరిగిన తర్వాత అంతోఇంతో బోనస్‌రూపంలో వస్తుందని ఉద్యోగులంతా వేయి కళ్లతో ఎదురు చూశారు. కనీసం ఒక నెలా జీతమైనా బోనస్‌రూపంలో అదనంగా రాబోతుందా అని ఆశించారు. కానీ ఎంత వచ్చిందో, ఎంత బొక్కారో ఇప్పటికీ సరిగ్గా తెలియదు. నెంబర్‌వన్‌ఛానల్‌అని, తానో మీడియా లెజెండ్రీ అని చెప్పుకునే ఆర్పీ సీక్రెట్‌గా కవర్లలో పెట్టి… తన వాళ్లకు మాత్రమే (అందులోనూ కోత పెట్టారు) డబ్బులు ఇచ్చారు. అంటే పూర్తిగా బ్లాక్‌మనీ అన్న మాట. మరి నీతి నిజాయితీ, న్యాయం, చట్టం, సెక్షన్లు అని మాట్లాడే ఈ మనిషి చానల్‌మొదటి నుంచి పని చేస్తున్న వారికి సైతం ఎందుకు డబ్బులు ఇవ్వలేదు. ఆర్పీని తీసేసిన తర్వాత ఈ విషయం బయట పడటంతో ఉద్యోగుల నుంచి ఇతడికి ఏ మాత్రం సానుభూతి రాలేదు. పైగా కోపం మరింత పెరిగింది. మన కడుపు కొట్టాడు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని టీవీ9 ఉద్యోగులంతా చెప్పుకునే పరిస్థితి.
సగం బోనస్సే..
ఆరున్నర కోట్లను బోనస్‌గా తీసుకున్న ఆర్పీ… టీవీ9 చరిత్రలో ఉద్యోగులకు బోనస్‌ఇచ్చింది కేవలం రెండే రెండు సార్లు. అది కూడా ఒకసారి సగం నెల జీతం మాత్రమే. బోనస్‌ఇచ్చిన ఏడాది జీతాల పెంపు లేదు. అదేమంటే బోనస్‌ఇచ్చాం కదా అనే సమాధానం వచ్చిందట. 2014 తర్వాత మూడేళ్లు వరుసగా జీతాలు పెంచలేదు.
తన ఖాతాలో రూ.6.50 కోట్లు
బోనస్‌రూపంలో (ట్యాక్స్‌కాకుండా) రూ.6.50 కోట్లను ఆర్పీ తన ఖాతాలో వేసుకున్నాడన్న విషయం తెలిశాక టీవీ9 ఉద్యోగుల్లో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. మూర్తికి మరో ఐదున్నర కోట్లను కట్టబెట్టాడు. ఇదంతా వైట్‌మనీ. బ్లాక్‌ఎంత తిన్నాడో ఎవరికీ తెలియదు. ఆర్పీ అరెస్ట్‌తో టీవీ9 ఉద్యోగుల నుంచి ఏ మాత్రం సానుభూతి రాకపోవడానికి కారణం ఇదే. ఉన్నన్ని రోజులూ జీతాలు సరిగ్గా పెంచక, పెంచినా తన వారికే ఎక్కువ ఇచ్చి, చాలా మందిని నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి పీకేసి, కొంతమందికి జీతాలు కోసేసి ఒకటా రెండా… చాలా దారుణమైన ఉద్యోగ వ్యతిరేక చర్యలు ఆర్పీపై ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి
నిత్యం మరమ్మతులే..
రవిప్రకాశ్‌సీఈవో ఉన్నన్ని రోజులూ ఆఫీసులో ఏదో ఒక మరమ్మతు పని జరుగుతూనే ఉంటుంది. కుర్చీలు మార్చడం, ఫ్లోరింగ్‌మార్చడం, కొత్త లిఫ్ట్, టైల్స్‌మార్చడం, చాంబర్లు మార్చడం ఇలా ఎప్పుడూ ఏదో ఒక పని జరుగుతూనే ఉండేది. ఇదంతా కేవలం ఉపాధి హామీ పనేనన్న విషయం ఇతడి వెళ్లిపోయిన తర్వాత తెలిసిందట. ఖర్చు చేసింది లక్ష అయితే… నాలుగైదు లక్షల బిల్లులు పెట్టుకోవడం,.. నొక్కేయడం తరచూ జరిగేదన్న విషయం ఉద్యోగులకు సైతం తెలిసిపోయింది. కేవలం ఆఫీస్‌లో టీ బిల్లులే లక్షల్లో మింగేశారని ప్రచారం జరుగుతోంది. వినాయక చవితికి పెట్టే ప్రసాదాలు, బయట లైవ్‌కవరేజ్‌ల కోసం పెట్టే ఖర్చలు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే… ఛీ మరింత కక్కుర్తా అనేలా ఉద్యోగులే చీదరించుకుంటున్న పరిస్థితి.
విచారణ తప్పనిసరి
ఈ రకంగా అటు బయటి వారినుంచి దండుకుని, ఇటు సొంత ఉద్యోగులను మోసం చేసి రవిప్రకాష్ చాలా వెనకేసుకున్నారనీ ప్రచారం వుంది. కేవలం ఒక్కసారికే బోనస్ రూపేణా 6.5 కోట్లు కొట్టేసిన ఖైదీ నెంబర్ 4412 ఇంకెన్ని వందల కోట్లు వెనకేసుకున్నాడో అనేది అంతుపట్టని విషయం. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి సీజె కు లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. సాన సతీష్ గతంలో టీవీ 9 ఆఫీసుకు వచ్చి తన ఛాంబర్లో రవిప్రకాష్ ని కలిసేవారని, గంటల తరబడి మాట్లాడుకునేవారని ప్రచారం వుంది.