ఖరీదైన వ్యాపారాన్ని కారుచౌకగా కొట్టేసిన టీవీ9 రవిప్రకాష్ నెలకు రూ.కోటి లాభం వచ్చే కేబుల్‌బిజినెస్‌ఈయన సొంతం దాన్లో 90 శాతం వాటాను కొనుగోలు చేసింది మాత్రం రూ.81 లక్షలకే
మిగిలిన 10 శాతం వాటాను రూ.33 లక్షలు పెట్టి కొన్న మరో భాగస్వామి షేరుకు ఆయన వెచ్చించింది రూ.140; రవిప్రకాష్‌పెట్టింది మాత్రం రూ.35 ఇద్దరూ కొనుగోలు చేసింది ఒకేరోజున… అది కూడా 2009 నవంబరు 27న ఆ వ్యాపారాన్ని 1997లో అక్కడ పెట్టింది ఎం.ఎస్.పార్థసారథి బృందం
10 వేల కనెక్షనున్నాయనుకున్నా… నెలకు కనెక్షన్‌కు రూ.1700 వసూలు ఈ లెక్కన నెలకు రూ.1.7 కోట్ల రెవెన్యూ; ఖర్చులు పోను రూ.కోటి లాభం ఏటా రూ.12 కోట్లు లాభం తెచ్చే వ్యాపారాన్ని ఎవరైనా రూ.కోటికే అమ్మేస్తారా? రూ.60 కోట్లకు అమ్మారనుకున్నా రవిప్రకాష్‌మిగిలిన సొమ్మునెలా పంపినట్టు?
సామాన్య పాత్రికేయుడైన రవిబాబుకు ఇంత సొమ్ము ఎలా వచ్చిందన్నదీ ప్రశ్నే
టీవీ నెక్ట్స్.
ఆఫ్రికా దేశమైన ఉగాండాలో వేగంగా విస్తరిస్తున్న కేబుల్‌టీవీ సంస్థ.
ఖర్చులు పోను నెలకు అథమం కోటి రూపాయలకు పైగా లాభాలు ఆర్జిస్తున్న సంస్థ.
తన యజమానికి ఏటా 12 కోట్ల రూపాయలపైగా లాభం తెస్తున్న సంస్థ.
ఆఫ్రికాలో తెలుగువారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే బోట్సువానా, జాంబియా, ఇథియోపియా, కెన్యా, ఘనా దేశాలకు విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంస్థ. అది కూడా… ‘‘మెరుగైన సమాజం కోసం’’ రోజుకు 24 గంటలూ అలుపు లేకుండా పనిచేస్తున్న మన తెలుగు వారి సంస్థ.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… టీవీ9 డైరెక్టరు, జర్నలిస్టు వెలిచాటి రవిబాబు అలియాస్‌రవిప్రకాష్‌సొంత సంస్థ.
అయితే ఏంటట? ఏం! రవిప్రకాష్‌కు సొంత వ్యాపారాలుండకూడదా? పొరుగు దేశాల్లో ఆయన బిజినెస్‌లేవీ చెయ్యకూడదా? ఆఫ్రికాలో కేబుల్‌సామ్రాజ్యం మొత్తాన్ని ఆయన కబ్జా చేస్తే మాత్రం తప్పేంటి? కోట్లకు కోట్ల రూపాయలు లాభం ఆర్జించటమేమీ నేరం కాదుకదా? మెరుగైన సమాజం కోసం పనిచేసే వారెవ్వరికైనా ఈ సందేహాలు అత్యంత సహజం.
నిజమే! రవిప్రకాష్‌ఆఫ్రికాలో మాత్రమే కాదు. అమెరికాలోను, ఆసియాలోను, ఆఖరికి అంటార్కిటికాలో వ్యాపారాలు చేసుకున్నా ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కాకపోతే ఆ వ్యాపారాన్ని అనుమానాస్పద స్థితిలో చేజిక్కించుకుంటేనే వస్తుంది చిక్కంతా!!. తన ఆదాయానికి మించి అడ్డగోలుగా ఆస్తులు కూడబెడితేనే వస్తుంది తంటా అంతా!! తన శక్తికి మించి ఆస్తుల్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతేనే వస్తుంది ఇబ్బంది అంతా!! ఈ కేబుల్‌వ్యాపారం రవిప్రకాష్‌చేతికి రావటంలో ఎన్ని గోల్‌మాల్‌వ్యవహారాలు నడిచాయో మీరే చూడండి….
ఉగాండాలో చెలామణిలో ఉన్న కరెన్సీని షిల్లింగ్‌లుగా పిలుస్తారు. మన రూపాయితో పోలిస్తే ఒక రూపాయికి 50 షిల్లింగ్‌లన్న మాట. అంటే మనం 10 రూపాయలు పెడితే 500 షిల్లింగ్‌లొస్తాయి. అక్కడ ‘కంపాలా సిటీ కేబుల్’ పేర టీవీ నెక్ట్స్‌బ్రాండ్‌తో సేవలందిస్తున్న రవిప్రకాష్‌నెలకు ఒకో కనెక్షన్‌కు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా..? 85వేల షిల్లింగ్‌లు. అంటే మన కరెన్సీలో 1700 రూపాయలు. పద్నాలుగేళ్లుగా వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు మొత్తంగా 10 వేల కనెక్షన్లు ఉన్నాయనుకున్నా… ఆ లెక్కన నెలకు రూ.1.7 కోట్లు వసూలు అవుతాయి. ఈ 1.7 కోట్లలో రూ.70 లక్షల్ని ఖర్చుల కింద తీసేసినా నెలకు అథమం కోటి రూపాయలు ఖాయంగా మిగులుతుందన్నది ఉగాండాలో కేబుల్‌వ్యాపారం గురించి బాగా తెలిసిన వర్గాల మాట. అంటే కంపాలా సిటీ కేబుల్‌యజమానులకు నెలకు రూ.కోటి చొప్పున ఏడాదికి రూ.12 కోట్లు లాభంగా వస్తోందనేది ఇక్కడ గమనించాల్సిన అంశం.
అసలీ కంపాలా కంపెనీ ఎవరిది?
‘కంపాలా సిటీ కేబుల్’ ఏర్పాటయింది 1997 డిసెంబరు 5న. అంటే పద్నాలుగేళ్ల కిందట. దీన్ని ఏర్పాటు చేసింది ఎం.ఎస్.పార్థసారథి, ఎ.సతీష్‌కుమార్, బి.ఆర్.శ్రీలక్ష్మి అనే ముగ్గురు తెలుగు వాళ్లు. ఉగాండా జనాభా దాదాపు 3.4 కోట్లు. అంటే దాదాపు 80 లక్షల కుటుంబాలు. కంపెనీలో ఎం.ఎస్.పార్థసారథికి 34 శాతం వాటా ఉండగా… మిగిలిన ఇద్దరికీ చెరో 33 శాతం వాటా ఉంది. కొన్నాళ్ల తరవాత సతీష్‌కుమార్‌వైదొలగటంతో ఆయన షేర్లను బర్కత్‌అలీ, బి.ఎస్.రమేష్‌బాబు, అమీర్‌అలీ జాసన్‌లు కొనుగోలు చేశారు.
2009 నవంబర్లో రవిప్రకాష్‌ఆరంగేట్రం…
2009 నవంబరు 27న ‘కంపాలా సిటీ కేబుల్‌లిమిటెడ్’ వ్యాపారంలోకి ప్రవేశించిన రవిప్రకాష్… అదే రోజున ఎం.ఎస్. పార్థసారథి, బర్కత్‌అలీ, అమీర్‌అలీ జాసన్, బి.ఎస్.రమేష్‌బాబుల పేరిట ఉన్న 2,35,000 షేర్లను దాదాపు 40 కోట్ల షిల్లింగ్‌లు వెచ్చించి అధికారికంగా కొనుగోలు చేశారు. 40 కోట్ల షిల్లింగ్‌లంటే మన కరెన్సీలో దాదాపు 80 లక్షల రూపాయలన్న మాట. ఇంకా చిత్రమేమిటంటే… అదే రోజున సీహెచ్.వి.ఆర్.సుబ్బారావు అనే వ్యక్తి కూడా దాదాపు 16 కోట్లకు పైగా షిల్లింగ్‌లను వెచ్చించి 23,850 షేర్లు కొనుగోలు చేశారు. అంటే మన కరెన్సీలో దాదాపు 34 లక్షలు వెచ్చించారు. తరవాత తన సన్నిహితులు ఒక్కొక్కరినీ దీన్లో షేరు హోల్డర్లుగా కాకపోయినా డైరెక్టర్లుగా చేర్చేశారు. ఫలితంగా వాటా అమ్మిన రమేష్‌బాబుతో పాటు వేముల పాటి శ్రీధర్, సీహెచ్.వీ.ఆర్.సుబ్బారావు, శింగిరి మధుసూదన్‌శిశిర్‌లు డైరెక్టర్లుగా మిగిలారు.
అసలు గోల్‌మాల్‌ఇదే…
ఇక్కడ జరిగిన గోల్‌మాల్‌ను ఒక్కసారి చూడండి. దాదాపు 34 లక్షల రూపాయలు వెచ్చించిన సుబ్బారావుకు 23,850 షేర్లు దక్కాయి. అంటే ఆయన ఒకో షేరును రూ.140 లెక్కన కొనుగోలు చేశారన్న మాట. రవిప్రకాష్‌కు మాత్రం రూ.80 లక్షలకే 2,35,000 షేర్లు దక్కాయి. అంటే ఆయన ఒకో షేరుకు రూ.35 మాత్రమే చెల్లించార న్న మాట. కానీ ఇద్దరు కొనుగోలు చేసిందీ నవంబరు 27, 2009 నాడే. మరి ఇద్దరి ధరలోనూ ఎందుకింత తేడా? సుబ్బారావుకు కొనుగోలు చేసిన ధరకే రవిప్రకాష్‌కూడా కొనుగోలు చేసి ఉంటే మొత్తంగా రూ.3.29 కోట్లు చెల్లించి ఉండాలి కదా!! అధికారికంగా 80 లక్షలే చెల్లించారంటే మిగతా రెండున్నర కోట్లను హవాలా వంటి ఇతర మార్గాల్లో ఏమైనా చెల్లించారా? మనీ లాండరింగ్‌మార్గాల్లో తరలించారా? లేకుంటే ఆ షేర్లు విక్రయించినవారికి రవిప్రకాష్‌పై అంత ప్రేమ ఎందుకుంటంది? వారికి ఈయన వేరే రకంగా ఏమైనా ఉపయోగపడ్డారా? ఇవన్నీ లోతైన విచారణ జరిపితే తప్ప తేలే అంశాలు కావన్నది సుస్పష్టం.
అంత చౌకగా ఎవరైనా విక్రయిస్తారా?
ఇక్కడింకా కీలకమైన ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నెలకు రూ.కోటికి పైగా నికరంగా లాభం వచ్చే వ్యాపారాన్నెవరైనా కోటి రూపాయలకన్నా తక్కువ మొత్తానికి విక్రయించేస్తారా అన్నది. కొంచెం ఇంగితజ్ఞానం ఉన్నవారెవరైనా అలా చెయ్యరనే చెబుతారు. ఏడాదికి 12 కోట్ల రూపాయల లాభం వచ్చే కంపెనీని విక్రయించాలంటే కనిష్టంగా వార్షిక లాభానికి ఐదు రెట్లయినా వెచ్చించాల్సి ఉంటుంది. అంటే 5 పీఈ (పర్‌ఎర్నింగ్స్) అన్నమాట. ఈ లెక్కన చూసినా టీవీ నెక్ట్స్‌ను కొనుగోలు చేయడానికి రవిప్రకాష్‌తదితరులు కనీసం రూ.60 కోట్లు చెల్లించి ఉండాలి. కానీ అధికారికంగా రవిప్రకాష్‌రూ.80 లక్షలకు మించి చెల్లించలేదు. మరి మిగతా డబ్బును రవిప్రకాష్‌ఎలా చెల్లించి ఉంటారు? చెల్లించని పక్షంలో రవిప్రకాష్‌కు అంత చౌకగా వాళ్లు ఆ బిజినెస్‌ను కట్టబెట్టడానికి కారణమేమై ఉంటుంది? ఇవి కూడా సమగ్ర విచారణలో తప్ప తేలేవి కావు.
మామూలు ఉద్యోగికి అంత డబ్బెలా వస్తుంది?
రవిప్రకాష్‌నేపథ్యం చూసినపుడు… ఆయనేమీ మరీ శ్రీమంతుడు కాదు. తొలుత ఉషోదయం అనే ఓ చిన్న పత్రికలో రిపోర్టరుగా చేరాక సిటీ కేబుల్‌లో రిపోర్టరయ్యారు. తర్వాత జెమినీ టీవీలో… 2003లో టీవీ9లో చేరారు. టీవీ9లో 10 శాతం వాటాతో డైరెక్టరుగా ప్రవేశించినా… దీన్నుంచి మరీ వందలకు వందల కోట్లు సంపాదించటం సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకంటే టీవీ9 బ్రేక్‌ఈవెన్‌లోకి… అంటే లాభనష్టాలు లేని స్థితిలోకి వచ్చింది కూడా ఈ మధ్యనే. బ్రేక్‌ఈవెన్‌తరవాత వస్తే గిస్తే లాభాలొస్తున్నదీ ఈ మధ్యనే. సో! ఇదీ రవిప్రకాష్‌కథ. అంటే టీవీ9లో ఉద్యోగిగా జీతం, తన షేర్లపై వస్తేగిస్తే బోనస్‌తప్ప ఇతరత్రా ఆదాయమేదీ లేదు. అలాంటిది ఆఫ్రికాలో సైతం తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరిస్తున్నారు? తెలుగు వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండే ఇతర ఆఫ్రికన్‌దేశాల్లోకి సైతం కేబుల్‌సేవల్ని విస్తరించాలని, త్వరలో డీటీహెచ్‌వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తానని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నట్లు ఇప్పటికే తెలియవచ్చింది. అంటే మొత్తమ్మీద ఆఫ్రికాలో 150 నుంచి 200 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రణాళికలు వేస్తున్నారన్న మాట. మరి ఇంత డబ్బు రవిప్రకాష్‌కెలా వచ్చింది? రూ.కోట్లు ఆర్జించిపెట్టే వ్యాపారాన్ని అతి చౌకగా ఎలా సొంతం చేసుకోగలిగారు? ఇవన్నీ ఇపుడు సమగ్ర దర్యాప్తు కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నలు.
ఫోటోలు:
1) నెలసరి కేబుల్‌బిల్లు కింద 85వేల షిల్లింగ్‌లు చెల్లిస్తున్నట్లుగా నిరూపించే బిల్లు ఇది. అంటే మన కరెన్సీలో రూ.1,700.
2) బాబర్‌అలీ నుంచి రవిప్రకాష్91,125 షేర్లను 15.7 కోట్ల షిల్లింగ్‌లకు కొనుగోలు చేసినట్లుగా «ధ్రువీకరించే పత్రమిది.
3) అదేరోజున 23,850 షేర్లను 16.6 కోట్ల షిల్లింగ్‌లకు సీహెచ్.వీ.ఆర్.సుబ్బారావు కొనుగోలు చేసినట్లు ధ్రువీకరించే పత్రమిది.
4) కంపాలాలో రవిప్రకాష్‌యాజమాన్యంలోని కంపాలా సిటీకేబుల్‌కార్యాలయం.
https://www.youtube.com/watch?v=J7uAOc0jw5o