తెలుగు బిగ్‌బాస్ షో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లతో ట్రెండ్ అవుతోంది. కంటెస్టెంట్ల అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగేలా షో వార్తల్లో నిలుస్తోంది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాని ఇంటి సభ్యులతో చర్చించాడు. అనంతరం కంటెస్టెంట్లతో ఆడించిన ర్యాపిడ్ ఫైర్ ఆకట్టుకుంది. మరి ఎవరు ప్రొటెక్ట్ జోన్‌లోకి వెళ్లారు?.. ఎవరు హౌస్‌లోంచి బయటకు వెళ్తారో చూద్దాం..
సోమవారం నుంచి శుక్రవారం వరకు కంటెస్టెంట్లు చేసే హంగామాతో నడిచే షో.. వారాంతంలో నాని చేసే సందడితో బాగానే ఆకట్టుకుంటోంది ఈ వారం తనీష్ కెప్టెన్ అయి ఉండి స్టోర్ రూమ్‌లో నిద్రపోవడం ఏంటంటూ తనీష్‌ను మందలించాడు. సోమవారం ఎలిమినేషన్‌లో తనీష్ పోషించిన పాత్ర బాగుందని.. ఆ ఒక్క చోట మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడని చెప్పుకొచ్చాడు. కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన రోల్ రైడాను అభినందించిన నాని.. తన ఆటను మెచ్చుకున్నాడు. హౌస్‌లో ఒంటరిగా ఉంటున్నానని, కార్నర్ చేస్తున్నారని ఇంకా అంటున్నావంటే ఎవరిది తప్పంటూ కౌశల్‌ను మందలించాడు. మనం ఎలా ఉంటే ఇతరులు మనతో అలా ఉంటారు అంటూ కౌశల్‌కు సూచించాడు. స్నేహంగా ఉండాలని మాటల్లో చెబుతున్నావు.. కానీ చేతలు మాత్రం అలా కనిపించడం లేదంటూ ఫైర్ అయ్యాడు.
ఈ వారం విజృంభించాడని, ఎలిమినేషన్‌లో లేకపోవడం ఇది రెండో సారి అంటూ.. గణేష్‌ను ఆటపట్టించాడు. దీప్తి సునయన టాస్కులో సరిగా ఆడలేదని, కనీసం టాస్క్ రూల్స్ కూడా పాటించలేదని ఫైర్ అయ్యాడు. ఓ వైపు టాస్క్ నడుస్తుంటే నిద్ర పోతుందంటూ మందలించాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న రోల్ రైడా, పూజ, దీప్తి సునయన, శ్యామల, గీత, నూతన్ నాయుడులో.. గాయం అయినందున నూతన్ ఎలిమినేషన్ ప్రక్రియను పక్కన పెట్టేశారు. శ్యామల, గీతా మాధురిలు ప్రొటెక్షన్ జోన్‌లో ఉన్నట్టు నాని ప్రకటించాడు.
అయితే పూజ, రోల్ రైడా, దీప్తి సునయనలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో ఆదివారం కార్యక్రమంలో నాని ప్రకటించనున్నాడు. అయితే ఆనవాయితీగా వస్తున్న లీకులను బట్టి చూస్తే.. దీప్తి సునయనే ఈ వారం ఎలిమినేట్ అయిందని వార్తలు బయటకు వచ్చేశాయి. అయినా ఈ లీకుల విషయం పక్కనపెడితే.. సోషల్ మీడియాలో వస్తోన్న ట్రోలింగ్స్ తనపై పెరిగిపోతోన్న నెగెటివిటిని తెలియజేస్తోంది. టాస్క్‌లో యాక్టివ్‌గా ఉండకపోవడం, పబ్లిక్ కాల్ టాస్క్‌లో కౌశల్‌తో మాట్లాడిన తీరుతో నెటిజన్లు మండిపడుతున్నారు. దీప్తి సునయన ఎలిమినేట్ అయిన విషయం లాంచనప్రాయంగా బిగ్‌బాస్ ప్రకటించడమే మిగిలింది అనే కామెంట్స్ వినపడుతున్నాయి.