బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగోవారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఈ సారి కౌశల్, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్, దీప్తీ, గణేశ్, గీతా మాధురిలు ఇలా ఎక్కువ సంఖ్యలో నామినేట్ అవ్వడంతో ప్రేక్షకులు ఎలిమినేషన్ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి వారం కామన్ కంటెస్టెంట్ సంజనా ఎలిమినేట్ కాగా రెండోవారం నూతన నాయుడులు హౌస్ నుంచి నిష్క్రమించగా.. గత వారం కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యాడు.
నిన్న జరిగిన ఎపిసోడ్లో సామాన్యుడు గణేశ్‌తో పాటు, సింగర్ గీతా మాధురి ప్రొటెక్ట్ అయినట్లు హోస్ట్ నాని ప్రకటించాడు. ఓ సామాన్యుడు హౌస్లోఉండాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు గణేశ్‌కు మద్దతు తెలపగా.. గీతా మాధురి సోషల్ మీడియా క్యాంపైన్తో గట్టెక్కినట్లు తెలుస్తోంది. ఆమెకు మద్దతుగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఓ ప్రణాళికతో హౌస్‌లోకి వెళ్లినట్లు అర్థమవుతోంది. ఈ ఇద్దరు సేఫ్ అవడంతో ఎలిమినేట్ ఎవరు అనే విషయం పై ప్రజల్లో ఆశక్తి నెలకోంది.
అయితే ఇప్పుడు ఎలిమినేషన్‌కు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో వదిన గారు, పిన్నిగారు అనగానే దీప్తి, శ్యామల మనకు గుర్తుకువస్తారు. ఈ వారం దీప్తి ఎలిమినేట్ కావొచ్చనుకున్నారు. అయితే ఇది బిగ్‌బాస్ హౌస్ ఎమైనా జరగచ్చాని ముందు చెప్పినట్లుగానే …ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా, అందరితోను స్నేహపుర్వకంగా ఉండే శ్యామలనే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయం స్వయంగా ఆమె వెల్లడించింది. బిగ్‌బాస్ ఆశలపై నీళ్లు చల్లారు. ఈ వారం ఎలిమినేటయ్యేది ఎవరా? అనే ప్రేక్షకుల ఆతృతను క్యాచ్ చేసుకొని రేటింగ్స్ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్ టీమ్‌కు శ్యామల చేసిన చర్య మింగుడు పడటం లేదు.
ఎలిమినేషన్ ఎపిసోడ్ ఒకరోజు ముందు జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ వచ్చిందనుకుందో ఎమో కానీ.. ఇంటికి చేరిన వెంటనే ‘మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.. ఇంటికి వచ్చాను. నాకొడుకు ఇషాన్‌తో ఆడుకుంటున్నాను.’అని పోస్ట్ చేశారు. అయితే తన తప్పిదాన్ని గుర్తించిన శ్యామల వెంటనే ఆ పోస్ట్‌ను తొలిగించారు. అప్పటికే ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.