డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ.. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు సీనీ ప్రముఖులు ట్విటర్ వేదికగా ఆవేదన చెందారు. కాగా రజనీకాంతఖ కరుణానిధి మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ‘ఇది బ్లాక్ డే. ఈ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఇక రాధిక, ఖుష్బూ, హాన్సికలు కూడా తమ సంతాపం తెలియజేశారు.
రాధిక: ఇది మాకు చీకటి రోజు. నా మనసు మొత్తం ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి. ఆయన సంకల్పం ఎప్పుడూ జీవంతోనే ఉంటుంది. ఆయన్ను మిస్ అయ్యాం. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు’. ఖుష్బూ: నెల క్రితం నేను ఆయనతో కలిసి దిగిన ఫొటో ఇది. గొప్ప నాయకుడైన ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం అప్పా’. హన్సిక: ‘దేశంలోనే ఓ గొప్ప నాయకుడు కరుణానిధి గారు కన్నుమూశారు. ఈ లోటును జీర్ణించుకునే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మొత్తం తమిళులకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ వీరు ఈ సందర‍్భంగా కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఫోటోలను షేర్ చేశారు.