అక్కినేని అఖిల్ , వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇంత వరకు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. మొదటి షెడ్యూల్ ని యూకే లో షూట్ జరపాలని అప్పట్లో వెంకీ ప్లాన్ చేశారు. ఇందుకోసం లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారనే వార్తలొచ్చాయి. దీనిపై వెంకీ కూడా స్పందించి లండన్ లో షూటింగ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు షూటింగ్ మొదలు కాకపోడం విశేషం.
తాజగా ఈ ప్రాజెక్టుపై వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కు వీసా సమస్యలు తలెత్తడంలో ఆలస్యం అయిందట. దాదాపు షూటింగ్ అక్కడే జరగనుండడంతో చాలా మందికి వీసాలు రావడంలో ఆలస్యం జరిగిందని. అయితే ప్రస్తుతానికి ఆ సమస్యలు దాదాపు క్లియర్ అవ్వడంతో ఈనెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనున్నారు. ఒక్కసారి షూట్ మొదలయితే దాదాపు 70 శాతం షూటింగ్ అక్కడే పూర్తి కానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటింస్తోంది. ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమాని BVSN ప్రసాద్ నిర్మించనున్నారు