ఈనెల 26న వస్తున్న “బంతిపూల జానకి”
ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా.. హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ “బంతిపూల జానకి”. ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు. తేజ ఎగ్జిక్యూ టివ్ ప్రొద్యూసర్. శిల్ప కళావేదికపై.. భారీ చిత్రాల స్థాయిలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు విశేష స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు
ఈ సందర్భంగా దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. “ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణులందరి సహాయ సహకారాల వల్ల “బంతిపూల జానకి” చిత్రం అవుట్ పుట్ చాలా సంతృప్తిగా వచ్చింది. 2016లో ఘన విజయం సాధించబోయే చిన్న చిత్రాల జాబితాలో “బంతిపూల జానకి” తప్పక స్థానం సంపాదించుకుంటుంది. దర్శకుడిగా నాకు చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తేజ మాట్లాడుతూ.. “బోలె సంగీతం “బంతిపూల జానకి” చిత్రానికి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కామెడీ థ్రిల్లర్ ను ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు!!
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: డా. శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజ, నిర్మాతలు: కళ్యాణి-రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!