షారూక్ ఖాన్ నటిస్తున్నన క్రేజీ సినిమా `జీరో`. ఈ చిత్రంలో ఓ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నారు. ఒక అసాధారణ లక్షణాలు ఉన్న మరుగుజ్జుగా బాద్‌షా చేస్తున్న ప్రయోగం ఆషామాషీగా ఉండదని చెబుతున్నారు. ఈ సినిమాతో ఎట్టిపరిస్థితిలో గత పరాభవాల నుంచి బయటపడాలని కింగ్‌ఖాన్ ఎంతో తపిస్తున్నాడు. ఆ క్రమంలోనే స్నేహితుడు ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాణంలో ఎలాంటి రాజీకి పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌ని ఈ చిత్రానికి ఖర్చు చేస్తున్నారు.
ఇదివరకూ రిలీజ్ చేసిన జీరో టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఈద్‌కి అంతకుమించి ధమాకా టీజర్‌ని రిలీజ్ చేసేందుకు షారూక్, జీరో బృందం సన్నాహల్లో ఉన్నారు. ఈ ట్రైలర్‌లో ఓ ప్రత్యేకత ఉంటుందిట. ఇందులో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ అదిరిపోయే ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. సల్మాన్ – షారూక్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో అభిమానులు వీక్షించే ఛాన్సుందిట. అనుష్క శర్మ, కత్రినకైఫ్ ఈ చిత్రంలో కథానాయికలు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 ఈ చిత్రం రిలీజ్ చేయనున్నారు. ఆర్.మాధవన్, ఆలియాభట్, శ్రీదేవి, కరిష్మా కపూర్, కాజోల్ వంటి స్టార్లు ఈ చిత్రంలో అతిధులుగా కనిపించనున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో జీరో ఒకటి.