మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశమ ప్రపంచంలోనే భారతదేశం మొదటిస్థానంలో ఉందని లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ సర్వే తెలిపింది. భారత్‌లోని మహిళల పై పెరుగుతున్న లైంగిక వేధింపులు, హత్యలు, సామాజిక వివక్ష, శ్రమ దోపిడీ తదితర విషయాల్లో భారత్ ముందుందని సర్వే వెల్లడించింది. ఈ కోవలో సోమాలియా రెండో స్థానంలో, సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. చట్టాలు దేశంలోని మహిళలకు పూర్తి రక్షణ ఇవ్వలేకపోతున్నాయని పేర్కొంది.
ఈ సర్వే ఫలితాలపై కథానాయకుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అత్యంత ప్రమాదకర దేశంగా భారత్ తొలి స్థానంలో ఉండటం చాలా బాధాకరం అన్నారు. ‘ఈ విభాగంలో దేశం ముందుండటం బాధగా ఉంది. భారత్‌ను మహిళలకు సురక్షితమైన దేశంగా చేయడానికి మనం బాధ్యత వహించి, పరిస్థితిలో మార్పు తీసుకురావాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.మనోజ్ ట్విటర్‌లో చురుకుగా ఉంటుంటారు. ఆయన ఇప్పటికీ పలు సామాజిక అంశాల గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇటీవల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య పై ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశాడు.