తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి. అక్కడ తయారు చేసిన పూతరేకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. ఆత్రేయపురం పూతరేకుకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. విజయవాడలోని బెరంపార్కులో గురువారం ఆత్రేయపురానికి చెందిన నిపుణుల సాయంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ శ్రమించి 10 మీటర్ల పొడవైన పూతరేకును తయారు చేశారు.
ఇప్పటి వరకూ దేశంలో ఇదే అతిపెద్ద పూతరేకుగా గుర్తించిన ఇండియా బుక్ ప్రతినిధులు.. నిర్వాహకులకు ధ్రువీకరణపత్రం అందజేశారు. తాము తయారు చేసిన పది మీటర్ల పూతరేకు ఇండియాబుక్‌ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం పట్ల ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.